Global gold demand: అంతర్జాతీయంగా బంగారానికి పెరిగిన డిమాండ్

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని తెలిపారు.

అంతర్జాతీయంగా బంగారానికి తొలి త్రైమాసిక ప్రాతిపదికన గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది డిమాండ్ 3 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గిరాకీ 1,238 టన్నులకు చేరుకుంది. 2016 నుంచి ఇప్పటివరకు తొలి త్రైమాసికంలో బంగారానికి డిమాండ్ ఇంతగా ఎన్నడూ లేదు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారం డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. 2023లో ఇదే సమయానికి (తొలి త్రైమాసికంలో) ఓవర్-ది-కౌంటర్ అమ్మకాల (వికేంద్రీకృత మార్కెట్లో)ను మినహాయిస్తే పసిడి డిమాండ్ 5 శాతం తగ్గి 1,102 టన్నులకు దిగజారింది.

పెట్టుబడులు సుస్థిరంగా కొనసాగడం, సెంట్రల్ బ్యాంకుల నుంచి నిరంతరాయంగా కొనుగోళ్లు జరుగుతుండడం, ఆసియా దేశాల నుంచి డిమాండ్ బాగా ఉండడంతో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో బంగారం ధరల సగటు ఒక్క ఔన్సుకి 2,070 డాలర్లుగా ఉంది. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది తొలి త్రైమాసికానికి 5 శాతం అధికంగా రేటు నమోదైంది. అలాగే, గత ఏడాది మొత్తం సగటుతో పోల్చితే ఈ ఏడాది 10 శాతం పెరిగింది.

సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను అధిక స్థాయిలో చేయడంతో ఈ త్రైమాసికంలో అంతర్జాతీయంగా హోల్డింగ్‌లు 290 టన్నులకు చేరాయి. బార్, కాయిన్ పెట్టుబడుల డిమాండ్‌ గత ఏడాదితో పోల్చితే 3 శాతం పెరిగింది. అంతర్జాయంగా ఆభరణాల డిమాండ్ కూడా స్థిరంగా ఉంది.

Also Read: శుభవార్త.. బంగారం, వెండి ధరలు తగ్గుదల

ట్రెండింగ్ వార్తలు