Gold Price: బంగారం ధర రికార్డ్ బద్దలుకొడుతోంది. గోల్డ్, సిల్వర్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. 10 గ్రాముల గోల్డ్ ధర లక్ష 19వేలకి చేరువలో ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర లక్ష 18వేల 900 రూపాయలకు (రూ.1,18,900) చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే 2వేల 700 పెరిగింది గోల్డ్ రేట్. బంగారంతో పాటు వెండి ధరలు భగ్గుమంటున్నాయి. సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర లక్ష 39వేల 600 రూపాయలకు (రూ.1,39,600) చేరుకుంది.
దీపావళి నాటికి బంగారం ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ అంతకంటే ముందే గోల్డ్ రేట్ పరుగులు పెడుతోంది. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రపంచ సంకేతాల మధ్య బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
1. ”ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితులు మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. కేంద్ర బ్యాంకులన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని విపరీతంగా పెంచుకుంటున్నాయి. దీని వల్ల పసిడికి బాగా డిమాండ్ ఏర్పడింది. గోల్డ్ రేట్ల పెరుగుదలకు ఇది మొదటి కారణం.
2. యూరప్ లో నెలకొన్న టెన్షన్స్, వార్ సిట్యుయేషన్స్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లంతా సేఫ్ అయిన గోల్డ్ వైపు దృష్టి సారించారు. గోల్డ్ ధరలు విపరీతంగా పెరగడానికి ఇది రెండో కారణం.
3. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించింది. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించిందో.. బాండ్ లో ఈల్డ్స్ తగ్గుతాయి. బాండ్స్ లో పెట్టాల్సిన పెట్టుబడులన్నీ కూడా గోల్డ్ వైపు మళ్లించారు. దీంతో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డిమాండ్ గోల్డ్ కి ఏర్పడింది. కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు భారీగా పెరుగుతూ పోవడానికి ఇది మూడో కారణం.
టెక్నికల్ గా చూస్తే చార్ట్ లో నాలుగు నెలల కన్సాలిడేషన్ తర్వాత కన్సాలిడేషన్ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ తర్వాత కంటిన్యూగా ర్యాలీ చేస్తూ వెళ్తోంది. దీపావళి కన్నా ముందే గోల్డ్ ధరల ర్యాలీని ఎవరూ ఊహించలేదు. తులం గోల్డ్ ధర ఒక లక్ష 19వేలకి చేరువ కావడం చాలా పెద్ద ర్యాలీ అని చెప్పొచ్చు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు. హెచ్ 1 బీ వీసాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అవి అమెరికా ఎకానమీని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలు దీర్ఘకాలిక మాంద్యానికి కూడా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కూడా గోల్డ్ వైపే వెళ్లాయి. ఇలా గోల్డ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పాటు వెండి ధరలూ పెరుగుతున్నాయి” అని మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ వివరించారు.