Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం..
Gold Rate Today
Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్, సిల్వర్ రేట్లు పడిపోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ నెలాఖరు వరకు గోల్డ్ రేటు మరింత తగ్గే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లవైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ రేటు భారతదేశంలో శనివారం భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆదివారం స్థిరంగా కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 15డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 4,197 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గడిచిన మూడు రోజుల్లో హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.5,100 తగ్గింది. అయితే, ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వెండి రేటు భారీగా పెరిగింది. ఫలితంగా కిలో వెండి రూ.2లక్షలకు చేరువైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,19,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,30,150కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,450 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,30,300కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,19,300 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,30,150కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,95,900 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,90,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,99,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
