Virat Kohli : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్.. రోహిత్, నేను ముందే అనుకున్నాం..

Virat Kohli : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది.

Virat Kohli : సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్.. రోహిత్, నేను ముందే అనుకున్నాం..

Virat Kohli

Updated On : December 7, 2025 / 7:31 AM IST

Virat Kohli : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ జట్టు కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా.. రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. అయితే, శనివారం నిర్ణయాత్మక మ్యాచ్ విశాఖపట్టణం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.

Also Read: IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్‌.. సౌతాఫ్రికాకు ఇక ద‌బిడిదిబిడే..

విశాఖలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుత ఆటతీరును కనబర్చారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (116 నాటౌట్, 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులు) శతకం బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (65 నాటౌట్, 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించారు. అయితే, ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ సాయంతో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా నిలిచాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

ఈ వన్డే సిరీస్‌లో నేను ఆడిన విధానం నాకు సంతృప్తిని ఇచ్చింది. రెండుమూడేళ్లుగా నేను ఇలా ఆడలేదు. మధ్య ఓవర్లలో ఎలాంటి పరిస్థితినైనా జట్టుకు అనుకూలంగా మార్చగలనని తెలుసు. అది జట్టుకు చాలా సహాయపడుతుంది. నాకు ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను ఇప్పటికీ జట్టుకు సహకారం అందించగలిగినందుకు సంతోషిస్తున్నాని కోహ్లీ చెప్పారు.

నేను స్వేచ్ఛగా ఆడినప్పుడు సిక్సర్లు కొట్టగలనని నాకు తెలుసు. ఈ సిరీస్‌లో రాంచీలో ఆడిన ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత ఏ మ్యాచ్ లోనూ నేను ఆడలేదు. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లలో రాణించినందుకు సంతోషంగా ఉంది. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టుకోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని రోహిత్, నేను అనుకున్నాం. ఇప్పుడు జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అంటూ కోహ్లీ పేర్కొన్నారు.