IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్‌.. సౌతాఫ్రికాకు ఇక ద‌బిడిదిబిడే..

భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య (IND vs SA) డిసెంబ‌ర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

IND vs SA : ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్‌.. సౌతాఫ్రికాకు ఇక ద‌బిడిదిబిడే..

Good news to team india ahead of IND vs SA T20 Series

Updated On : December 6, 2025 / 5:38 PM IST

IND vs SA : భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య డిసెంబ‌ర్ 9 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు శుభ‌వార్త అందింది. ఈ సిరీస్‌లో ఆడేందుకు టీమ్ఇండియా టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌కు బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

వాస్త‌వానికి గిల్ ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. అయితే.. సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అత‌డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తేనే ఆడ‌తాడ‌ని జ‌ట్టును ప్ర‌క‌టించే స‌మ‌యంలో సెల‌క్ట‌ర్లు తెలిపారు.

Quinton de Kock : చ‌రిత్ర సృష్టించిన క్వింట‌న్ డికాక్‌.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌..

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా శుభ్‌మ‌న్ గిల్ మెడ ప‌ట్టుకుంది. దీంతో అత‌డు రెండో టెస్టుతో పాటు సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ప్ర‌స్తుతం అత‌డు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ లో కోలుకుంటున్నాడు. తాజాగా అత‌డు పూర్తి ఫిట్‌నెస్ ను సాధించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో అత‌డు టీ20 సిరీస్‌లో కనిపించనున్నాడు.

ద‌క్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

సూర్యకుమార్ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హర్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ, సంజూ శాంసన్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా, వాషింగ్టన్‌ సుందర్‌.

WBBL 2025 : బాల్ కార‌ణంగా ర‌ద్దైన మ‌హిళ‌ల బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఇలా ఎన్న‌డూ జ‌రిగి ఉండ‌దు.. పిచ్ మ‌ధ్య‌లో రంధ్రం..

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 9న (క‌ట‌క్‌)
* రెండో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 11న (ఛండీగ‌ర్‌)
* మూడో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 14న (ధ‌ర్మ‌శాల‌)
* నాలుగో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 17న (ల‌క్నో)
* ఐదో టీ20 మ్యాచ్ – డిసెంబ‌ర్ 19న (అహ్మ‌దాబాద్‌)