Flipkart Buy Buy Sale : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? 55-అంగుళాల స్మార్ట్‌టీవీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

Flipkart Buy Buy 2025 Sale : 55 అంగుళాల స్ర్కీన్లతో అద్భుతమైన స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు ఏ స్మార్ట్ టీవీ కావాలో ఎంచుకుని కొనేసుకోండి.

Flipkart Buy Buy Sale : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? 55-అంగుళాల స్మార్ట్‌టీవీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

Flipkart Buy Buy 2025 Sale

Updated On : December 7, 2025 / 12:48 PM IST

Flipkart Buy Buy 2025 Sale : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? 55-అంగుళాల స్క్రీన్‌లతో అనేక స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బైబై సేల్ 2025 సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్‌లతో కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.

ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా మీరు ఈ స్మార్ట్ టీవీలను తక్కువ ధరలకు (Flipkart Buy Buy 2025 Sale) కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో QLED టీవీలు కూడా ఉన్నాయి. ఇందులో మీరు బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 20వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో మీకు నచ్చిన స్మార్ట్‌టీవీని ఇంటికి తెచ్చుకోండి.

Coocaa Y74 ప్లస్ (55 అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ గూగుల్ టీవీ :
ఈ జాబితాలో Coocaa Y74 ప్లస్ (55 అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ గూగుల్ టీవీ 2025 ఎడిషన్ తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం రూ.22,499కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.54,999 నుంచి 59 శాతం తగ్గింపుతో లభ్యమవుతోంది.

అనేక ఆఫర్ల ద్వారా ఈ టీవీ ధరను ఇంకా తగ్గించవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD LED ప్యానెల్‌తో వస్తుంది. డాల్బీ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. గూగుట్ టీవీOS వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌తో వస్తుంది. స్పీడ్ కనెక్టివిటీతో పాటు OTT యాప్‌లను అందిస్తుంది.

బెస్టన్ (55 అంగుళాల) QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ :
ఈ బెస్టన్ (55 అంగుళాల) QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2025 ఎడిషన్ డిస్కౌంట్ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అసలు ధర రూ. 59,999 నుంచి ఏకంగా రూ. 20,999కు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం 65శాతం వరకు తగ్గింపుతో లభ్యమవుతుంది. అయితే, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ స్మార్ట్ టీవీ ధరను మరింత తగ్గించవచ్చు.

Read Also : Buy Term Life Insurance : మీకు టర్మ్ లైఫ్ పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి.. మీ ప్రీమియం 100% రీఫండ్ చేసుకోవచ్చు..!

55-అంగుళాల స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD QLED ప్యానెల్‌తో వస్తుంది. డాల్బీ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. 30W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. గూగుల్ TVOS వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌తో వస్తుంది. మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లు, ప్రీ-ఇన్‌స్టాల్ OTT యాప్స్ కూడా ఉన్నాయి.

టీసీఎల్ 55-అంగుళాల అల్ట్రా HD 4K టీవీ :

ఐఎఫ్‌ఫాల్కన్ (iFFALCON) టీసీఎల్ (55-అంగుళాల) అల్ట్రా HD (4K) LED స్మార్ట్ గూగుల్ టీవీ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ టీసీఎల్ టీవీలో 55-అంగుళాల అల్ట్రా HD డిస్‌ప్లే కూడా ఉంది. ఈ లేటెస్ట్ 2025 ఎడిషన్ టీవీ 63 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అసలు ధర రూ. 66,599 నుంచి రూ.23,999కి తగ్గుతుంది.

బ్యాంక్ ఆఫర్ల ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు. ఈ స్మార్ట్ గూగుల్ టీవీ డాల్బీ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. 24W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌తో కూడా వస్తుంది. మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లు, ప్రీ-ఇన్‌స్టాల్ OTT యాప్‌లను కూడా అందిస్తుంది.

ఫాక్స్‌కై (55-అంగుళాల) QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ
ఈ ఫాక్స్‌కై (Foxsky) 55-అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ 74శాతం తగ్గింపుతో లభిస్తుంది. ధర రూ. 98,999 నుంచి రూ. 24,999కి తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గుతుంది. ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED ప్యానెల్ డిస్‌ప్లే ఉంది. డాల్బీ ఆడియోకు సపోర్టు ఇస్తుంది. 30W సౌండ్ అవుట్‌పుట్‌ అందిస్తుంది. వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్, అనేక కనెక్టివిటీ పోర్ట్‌లు ప్రీ-ఇన్‌స్టాల్ OTT యాప్ సపోర్ట్‌తో గూగుల్ టీవీOSలో రన్ రన్ అవుతుంది.