Buy Term Life Insurance : మీకు టర్మ్ లైఫ్ పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి.. మీ ప్రీమియం 100% రీఫండ్ చేసుకోవచ్చు..!

Buy Term Life Insurance : టర్మ్ లైఫ్ పాలసీ ఏది తెలుసుకోవాలో తెలియడం లేదా? పాలసీ గడువు ముగిసినా కూడా మీ ప్రీమియం మొత్తం చెల్లించే పాలసీలను ఎంచుకోండి.. పూర్తి వివరాలివే..

Buy Term Life Insurance : మీకు టర్మ్ లైఫ్ పాలసీ ఉందా? లేదంటే ఇప్పుడే తీసుకోండి.. మీ ప్రీమియం 100% రీఫండ్ చేసుకోవచ్చు..!

Buy Term Life Insurance

Updated On : December 7, 2025 / 12:11 PM IST

Buy Term Life Insurance : మీకు టర్మ్ లైఫ్ పాలసీ ఉందా? లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికి తప్పనిసరిగా జీవిత బీమా ఉండాల్సిందే. కష్ట సమయాల్లో ఈ జీవిత బీమా మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది.

దురదృష్టవశాత్తూ పాలసీదారుడికి అకాల (Buy Term Life Insurance) మరణం సంభవిస్తే ఆ పాలసీకి సంబంధించిన మొత్తాన్ని సంబంధిత కుటుంబ సభ్యులకు అందుతుంది. ఆర్థిక భద్రతను అందించే ఈ జీవిత బీమా పాలసీలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల బీమా పాలసీలు ఉన్నాయి.

అందులో ప్రధానంగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యంత సరసమైన పాలసీగా చెప్పవచ్చు. ఇతర లైఫ్ పాలసీలతో పోలిస్తే ఈ టర్మ్ పాలసీల ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. బీమా కవరేజీ చాలా ఎక్కువ. కానీ, ఇందులో ఒక విషయంలో బెనిఫిట్ పొందలేరు. పాలసీ గడువు తీరే నాటికి పాలసీదారు బతికి ఉంటే మాత్రం అప్పటివరకూ చెల్లించిన ప్రీమియం తిరిగి పొందలేరు.

TROP ప్రీమియం ప్లాన్లు ఎంచుకోండి :

పాలసీ గడువు ముగిశాక రిఫండ్ కోరుకునే వారి కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్‌తో టర్మ్ ప్లాన్లను (TROP) అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ప్లాన్లను తీసుకుంటే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : Flipkart Buy Buy Sale 2025 : ఫ్లిప్‌కార్ట్‌ బై బై సేల్.. ఈ శాంసంగ్ 5G ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లతో ఇలా కొనేసుకోండి!

అదేవిధంగా, సంప్రదాయ టర్మ్ పాలసీలను పరిశీలిస్తే.. రెండింతల వరకు ప్రీమియం చెల్లించాలి. అంతేకాదు.. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రీమియం రిఫండ్ రెండూ ఎంచుకోవచ్చు. అవసరమైతే రిటర్న్ ఆఫ్ ప్రీమియం (RTP) ఆప్షన్‌తో టర్మ్ లైఫ్ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. అంటే.. ఈ టర్మ్ పాలసీలను తీసుకున్న పాలసీదారులు మరణించినా లేదా పాలసీ గడువు ముగిసినా కూడా అప్పటివరకూ చెల్లించిన మొత్తం ప్రీమియం తిరిగి పొందవచ్చు.

పాలసీ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి :
బీమా కంపెనీ రిఫండ్ ప్రీమియం మొత్తంలో ఛార్జీలంటూ ఏదైనా మినహాయించనుందా లేదో తెలుసుకోవాలి. అన్ని వివరాలను పాలసీ తీసుకోవడానికి ముందే డాక్యుమెంట్లను చెక్ చేసుకోవాలి. లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధిని సంప్రదించి పాలసీ అన్ని వివరాలను తెలుసుకోండి.

సాధారణంగా ఏదైనా ఇన్స్‌రెన్స్ తీసుకునేటప్పుడు ఆయా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ల హిస్టరీని కూడా తెలుసుకోవాలి. పాలసీదారులకు ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్ చేసే కంపెనీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రీమియం పేమెంట్ల విషయంలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ముందుగా తెలిసి ఉండాలి. బీమా కంపెనీలు 12 నెలలు, 6 నెలలు, త్రైమాసిక, నెలవారీ పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయి. మీ ఆదాయానికి తగిన విధంగాఆప్షన్‌ను ఎంచుకోండి. ప్రీమియం రిఫండ్‌ మాత్రమే కాదు.. యాక్సిడెంటల్ డెత్, క్రిటికల్ ఇల్నెస్, డిసేబిలిటీ బెనిఫిట్ వంటి రైడర్ ఆప్షన్లు ఉన్న ప్లాన్లను తీసుకోవడం మంచిది. అయితే, ఈ రైడర్లకు మీరు అదనంగా ప్రీమియం చెల్లించాలి.