LIC Insurance Plans : LICలో 2 సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు.. కష్ట సమయాల్లో మీకే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా శ్రీరామరక్ష.. ఫుల్ డిటెయిల్స్..!

LIC Insurance Plans : ఎల్ఐసీలో రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఏదైనా కష్ట సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.

LIC Insurance Plans : LICలో 2 సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు.. కష్ట సమయాల్లో మీకే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా శ్రీరామరక్ష.. ఫుల్ డిటెయిల్స్..!

LIC Insurance Plans

Updated On : December 6, 2025 / 7:59 PM IST

LIC Insurance Plans : ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అందులో ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్. ఈ ప్లాన్‌లు గ్యారెంటీ సేవింగ్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక రాబడిని పొందవచ్చు.

అయితే బీమా కవచ్ ఆర్థిక భద్రతను (LIC Insurance Plans) పెంచుతుంది. ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్‌లు దీర్ఘకాలిక పాలసీని అందిస్తాయి. ఇన్సూర్ చేసిన వ్యక్తితో పాటు వారి ఫ్యామిలీలకు కష్ట సమయాల్లో ఆర్థికపరంగా ప్రొటెక్షన్ అందిస్తాయి. ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్‌ల గురించి వివరంగా పరిశీలిద్దాం..

ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ :
ఈ పథకం సేవింగ్స్ బీమాను మెర్జ్ చేయాలనుకునే వారికి లేదా పెట్టుబడుల ద్వారా కార్పస్‌ను కూడబెట్టుకోవాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. డెత్ కవరేజీని అందించడమే కాకుండా పెట్టుబడి, యూనిట్ ఫండ్ ఆధారిత వాల్యూను కూడా కలిగి ఉంటుంది. ఈ పథకం మీ ఫండ్స్ మార్కెట్‌కు లింక్ అయి ఉంటుంది. ట్రెడిషనల్ ఎల్ఐసీ పాలసీలతో పోలిస్తే అధిక రాబడిని అందిస్తుంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ బ్రేకింగ్.. పెన్షనర్లు, కేంద్ర ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయా? కేంద్రం క్లారిటీ ఇదిగో..!

ఈ LIC పాలసీ ప్రత్యేకత ఏంటి? :

  • ఈ ఎల్ఐసీ పాలసీలో 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులకు
  • మీకు సరిపోయే పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. 10, 15, 20, లేదా 25 ఏళ్ల వరకు
  • ప్రీమియం పేమెంట్ వ్యవధి 5, 7, 10 లేదా 15 ఏళ్లు కావచ్చు.
  • నిర్ణీత కాలపరిమితిలోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
  • మీరు వార్షిక ప్రీమియంకు 5 నుంచి 7 రెట్లు బీమా మొత్తాన్ని పొందవచ్చు.
  • అవసరమైతే టాప్-అప్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.
  • పాలసీదారులు నచ్చిన ఫండ్ ఎంచుకోవచ్చు.
  • ప్రీమియంను ఏ పెట్టుబడి ఫండ్ కేటాయించాలో నిర్ణయించుకోవచ్చు.
  • ఈ పాలసీలో పాక్షిక విత్‌డ్రా ఆప్షన్ కూడా ఉంది.
  • పాలసీ ప్రారంభ తేదీ నుంచి 5 ఏళ్ల తర్వాత ఫండ్స్ నుంచి కొంత భాగాన్ని విత్‌డ్రా చేయొచ్చు.
  • పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత (లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఇంకా జీవించి ఉంటే) మెచ్యూరిటీ బెనిఫిట్ యూనిట్-ఫండ్ వాల్యూ చెల్లిస్తారు.
  • పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి గ్యారెంటీ ఇచ్చిన మొత్తం డబ్బులు అందుతాయి.

ఎల్ఐసీ బీమా కవచ్ :
ఈ పథకం పూర్తిగా రిస్క్ ప్రొటెక్షన్ లాంటి స్కీమ్. ఇందులో పెట్టుబడి లేదా సేవింగ్స్ ఉండవు. కానీ, పాలసీదారుడి కుటుంబానికి లేదా నామినీ మరణించినప్పుడు వారికి ఫిక్స్‌డ్ డెత్ బెనిఫిట్ అందిస్తుంది. ఈ ఎల్ఐసీ పథకం ఒక నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.

స్కీమ్ ఫీచర్లు :

  • 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల ఏ వ్యక్తి అయినా ఈ పథకం బెనిఫిట్స్ పొందవచ్చు.
  • పాలసీ వ్యవధి లేదా గరిష్ట వయస్సు 100 ఏళ్ల వరకు మెచ్యూరిటీ ఉంటుంది.
  • ఈ పాలసీ కింద లెవల్ సమ్ అష్యూర్డ్ పెరిగే మొత్తాన్ని కాలక్రమేణా ఎంచుకునే ఆప్షన్
  • సింగిల్, లిమిటెడ్, రెగ్యులర్ ప్రీమియం చెల్లించే ఆప్షన్
  • సింగిల్-ప్రీమియం కనీస కాలవ్యవధి 10 ఏళ్లు, లిమిటెడ్-ప్రీమియం 10, 15, 20 ఏళ్లు, రెగ్యులర్-ప్రీమియం కనీస కాలవ్యవధి 10 ఏళ్లు
  • కనీస బీమా మొత్తం రూ. 2 కోట్లు.