Telugu » Business » Lic Launches 2 New Plans Get More Benefit For You And Your Family Check Full Details Sh
LIC Insurance Plans : LICలో 2 సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లు.. కష్ట సమయాల్లో మీకే కాదు.. మీ ఫ్యామిలీకి కూడా శ్రీరామరక్ష.. ఫుల్ డిటెయిల్స్..!
LIC Insurance Plans : ఎల్ఐసీలో రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఏదైనా కష్ట సమయాల్లో ఆర్థికంగా ఆదుకుంటాయి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
LIC Insurance Plans : ఎల్‌ఐసీ వినియోగదారులకు గుడ్ న్యూస్.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు సరికొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అందులో ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్. ఈ ప్లాన్‌లు గ్యారెంటీ సేవింగ్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. ప్రొటెక్షన్ ప్లస్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక రాబడిని పొందవచ్చు.
అయితే బీమా కవచ్ ఆర్థిక భద్రతను (LIC Insurance Plans) పెంచుతుంది. ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్‌లు దీర్ఘకాలిక పాలసీని అందిస్తాయి. ఇన్సూర్ చేసిన వ్యక్తితో పాటు వారి ఫ్యామిలీలకు కష్ట సమయాల్లో ఆర్థికపరంగా ప్రొటెక్షన్ అందిస్తాయి. ఈ రెండు ఎల్ఐసీ ప్లాన్‌ల గురించి వివరంగా పరిశీలిద్దాం..
ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్ :
ఈ పథకం సేవింగ్స్ బీమాను మెర్జ్ చేయాలనుకునే వారికి లేదా పెట్టుబడుల ద్వారా కార్పస్‌ను కూడబెట్టుకోవాలనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. డెత్ కవరేజీని అందించడమే కాకుండా పెట్టుబడి, యూనిట్ ఫండ్ ఆధారిత వాల్యూను కూడా కలిగి ఉంటుంది. ఈ పథకం మీ ఫండ్స్ మార్కెట్‌కు లింక్ అయి ఉంటుంది. ట్రెడిషనల్ ఎల్ఐసీ పాలసీలతో పోలిస్తే అధిక రాబడిని అందిస్తుంది.
ఈ ఎల్ఐసీ పాలసీలో 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులకు
మీకు సరిపోయే పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు. 10, 15, 20, లేదా 25 ఏళ్ల వరకు
ప్రీమియం పేమెంట్ వ్యవధి 5, 7, 10 లేదా 15 ఏళ్లు కావచ్చు.
నిర్ణీత కాలపరిమితిలోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
మీరు వార్షిక ప్రీమియంకు 5 నుంచి 7 రెట్లు బీమా మొత్తాన్ని పొందవచ్చు.
అవసరమైతే టాప్-అప్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.
పాలసీదారులు నచ్చిన ఫండ్ ఎంచుకోవచ్చు.
ప్రీమియంను ఏ పెట్టుబడి ఫండ్ కేటాయించాలో నిర్ణయించుకోవచ్చు.
ఈ పాలసీలో పాక్షిక విత్‌డ్రా ఆప్షన్ కూడా ఉంది.
పాలసీ ప్రారంభ తేదీ నుంచి 5 ఏళ్ల తర్వాత ఫండ్స్ నుంచి కొంత భాగాన్ని విత్‌డ్రా చేయొచ్చు.
పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత (లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఇంకా జీవించి ఉంటే) మెచ్యూరిటీ బెనిఫిట్ యూనిట్-ఫండ్ వాల్యూ చెల్లిస్తారు.
పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి గ్యారెంటీ ఇచ్చిన మొత్తం డబ్బులు అందుతాయి.
ఎల్ఐసీ బీమా కవచ్ :
ఈ పథకం పూర్తిగా రిస్క్ ప్రొటెక్షన్ లాంటి స్కీమ్. ఇందులో పెట్టుబడి లేదా సేవింగ్స్ ఉండవు. కానీ, పాలసీదారుడి కుటుంబానికి లేదా నామినీ మరణించినప్పుడు వారికి ఫిక్స్‌డ్ డెత్ బెనిఫిట్ అందిస్తుంది. ఈ ఎల్ఐసీ పథకం ఒక నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.
స్కీమ్ ఫీచర్లు :
18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల ఏ వ్యక్తి అయినా ఈ పథకం బెనిఫిట్స్ పొందవచ్చు.
పాలసీ వ్యవధి లేదా గరిష్ట వయస్సు 100 ఏళ్ల వరకు మెచ్యూరిటీ ఉంటుంది.
ఈ పాలసీ కింద లెవల్ సమ్ అష్యూర్డ్ పెరిగే మొత్తాన్ని కాలక్రమేణా ఎంచుకునే ఆప్షన్