Bank Holidays March 2026 : మార్చిలో బ్యాంకులో పని ఉందా? 17 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో
Bank Holidays March 2026 : మార్చి నెలలో హోలీ, ఈద్, మహావీర్ జయంతి ప్రధాన పండుగలు ఉన్నాయి. ఈ పండుగల కారణంగా బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. బ్యాంకుకు వెళ్లే ముందు సెలవుల జాబితాను చెక్ చేయండి.
Bank Holidays March 2026 ( Image Credit : Google Gemeni AI )
- 2026 మార్చిలో మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు
- రాష్ట్రాల వారీగా ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులంటే?
- పండగ సెలవులు, ప్రభుత్వ సెలవుల పూర్తి వివరాలు
- ఆర్బీఐ బ్యాంకు క్యాలెండర్ 2026 ఫుల్ లిస్ట్ చెక్ చేయండి
Bank Holidays March 2026 : మీకు 2026 మార్చి నెలలో బ్యాంకులో పని ఉందా? అయితే, ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే నెలలో బ్యాంకులకు మొత్తం 17 రోజులు సెలవులు ఉన్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో పండుగలు, కార్యక్రమాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి. హోలీ, ఈద్, రామనవమి వంటి ప్రధాన పండుగలు మార్చిలోనే వస్తాయి. అంతేకాదు.. మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో 5 ఆదివారాలు కూడా ఉన్నాయి.
ఆర్బీఐ క్యాలెండర్ పరిశీలిస్తే.. ఈ నెలలో రెండో శనివారం, నాల్గవ శనివారాల్లో బ్యాంకులు కూడా మూతపడతాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా లేదా చెక్కును క్యాష్‌గా మార్చుకోవడం వీలు పడదు. ఆయా తేదీల్లో బ్యాంకులు మూతపడతాయి. ఈ సమస్య రాకుండా ముందుగానే ఒక ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇంతకీ ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో రాష్ట్రాల వారీగా ఈ లిస్టును చెక్ చేయండి.
అరుణాచల్ ప్రదేశ్ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 31 : మహావీర్ జయంతి
అస్సాం :
మార్చి 3 : హోలీ (డోల్ జాత్రా)
మార్చి 21 : రమదాన్ ఈద్/సర్హుల్
బీహార్ :
మార్చి 3 నుంచి మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 27 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
చండీగఢ్ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
ఛత్తీస్‌గఢ్ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 31 : మహావీర్ జయంతి
ఢిల్లీ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 31 : మహావీర్ జయంతి
గోవా :
మార్చి 3 : హోలీ
మార్చి 19 : గుడి పద్వా
మార్చి 21 : రంజాన్ ఈద్
గుజరాత్ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 31 : మహావీర్ జయంతి
హిమాచల్ ప్రదేశ్ :
మార్చి 4 : హోలీ
మార్చి 26 : శ్రీరామ నవమి
జమ్మూ కాశ్మీర్ :
మార్చి 4 : హోలీ
మార్చి 17 : షబ్-ఎ-ఖాదర్
మార్చి 19 – గుడి పడ్వా / నవరాత్రి
మార్చి 20 – ఈద్ అల్-ఫితర్ (జుమాత్ అల్-విదా)
మార్చి 21 : రంజాన్ ఈద్
జార్ఖండ్ :
మార్చి 3 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
కర్ణాటక :
మార్చి 19 : ఉగాది
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
కేరళ :
మార్చి 3 – హోలీ, అట్టుకల్ పొంగలా
మార్చి 20 : ఈద్ అల్-ఫితర్
మధ్యప్రదేశ్ :
మార్చి 3 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26, మార్చి 27 శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
మహారాష్ట్ర (ముంబై, నాగ్‌పూర్) :
మార్చి 3 : హోలీ
మార్చి 19 : గుడి పద్వా
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
మణిపూర్ :
మార్చి 4 : హోలీ, యావోసాంగ్
మార్చి 19 : సాజిబు నోంగ్పాన్బా
మార్చి 21 : రంజాన్ ఈద్
మేఘాలయ :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మిజోరం :
మార్చి 4 : హోలీ
మార్చి 13 : చాప్చర్ కుట్
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
నాగాలాండ్ :
మార్చి 21 : రమదాన్ ఈద్, సర్హుల్
ఒడిశా :
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 27 : శ్రీరామ నవమి
రాజస్థాన్ :
మార్చి 3 : హోలీ
మార్చి 19 – గుడి పడ్వా , నవరాత్రి
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
సిక్కిం :
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 27 : శ్రీరామ నవమి
తమిళనాడు :
మార్చి 19 : ఉగాది
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
త్రిపుర :
మార్చి 4 : హోలీ
ఉత్తరాఖండ్ :
మార్చి 3 లేదా మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
ఉత్తర ప్రదేశ్ (కాన్పూర్, లక్నో) :
మార్చి 2 : హోలిక దహన్
మార్చి 4 : హోలీ
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
పశ్చిమ బెంగాల్ :
మార్చి 3 : హోలీ, డోల్ జాత్ర
మార్చి 21 : రంజాన్ ఈద్
మార్చి 26 : శ్రీరామ నవమి
మార్చి 31 : మహావీర్ జయంతి
ఆంధ్రప్రదేశ్ :
మార్చి 3 : హోలీ (రెండో రోజు)
తెలంగాణ :
మార్చి 3 : హోలీ
మార్చి 19 : ఉగాది
మార్చి 27 : శ్రీరామ నవమి
మార్చి 19 – ఉగాది, తెలుగు నూతన సంవత్సరం
మార్చి 20 – ఈద్ అల్-ఫితర్ (జుమాత్ అల్-విదా)
మార్చి 27 : శ్రీరామ నవమి
స్టాక్ మార్కెట్ సెలవులు :
మార్చి 3, మార్చి 26, మార్చి 31 తేదీలలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ట్రేడింగ్ కోసం మూతపడనున్నాయి.
కస్టమర్లు తప్పక తెలుసుకోండి :
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడితే క్యాష్ డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, డాక్యుమెంట్ల సమర్పణపై ప్రభావం పడవచ్చు. అయితే, ఏటీఎంలు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీసులు పనిచేస్తూనే ఉంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, బిల్లు పేమెంట్లు వంటి సర్వీసులు బ్యాంకు సెలవు దినాల్లో కూడా పనిచేస్తాయి.
