Post Office Scheme : మీ జీతం పడగానే ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెట్టండి.. మీకు ప్రతినెలా రూ.9250 వడ్డీ వస్తుంది.. ఎలాగంటే?
Post Office MIS : మీరు పెట్టుబడి కోసం చూస్తున్నారా? ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టండి. మీరు ప్రతి నెలా రూ. 9,250 వడ్డీని పొందవచ్చు. పూర్తి పథకం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Post Office Scheme
- పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ (MIS) పథకం
- ఈ పథకంలో పెట్టుబడిపై ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు
- ఒకసారి పెట్టుబడి పెడితే నెలకు రూ. 9,250 వడ్డీ పొందవచ్చు
Post Office MIS Scheme : మీకు ఈసారి జీతం పడగానే ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టండి. లేదంటే ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి కోసం చూస్తుంటే పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే.. ఈ పథకాల్లో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు.
మీ డబ్బు ఎక్కడికి పోదు. ప్రస్తుత రోజుల్లో పెట్టుబడి అత్యంత ముఖ్యమైనది. భవిష్యత్తులో డబ్బు అవసరమైతే ఎవరిపై ఆధారపడాల్సిన పనిలేకుండా ప్రతి ఒక్కరూ తమ సంపాదించిన డబ్బుపై పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు.
కొంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. మరికొందరు ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. మరికొందరు సేవింగ్స్ అకౌంట్లు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి ఆప్షన్లను ఎంచుకుంటారు. పూర్తి భద్రతతో పాటు అధిక రాబడిని అందించే పథకాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
మీరు కూడా ఇలాంటి జీరో రిస్క్ పథకం కోసం చూస్తుంటే పోస్టాఫీసు అందించే నెలవారీ ఆదాయ పథకం (MIS) అద్భుతంగా ఉంటుంది. ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. తద్వారా మీరు ప్రతి నెలా రూ.9వేలకు పైగా ఎక్కువ వడ్డీని సంపాదించవచ్చు. ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
పోస్టాఫీస్ MIS పథకంలో పెట్టుబడి :
సాధారణంగా ఎవరైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. చాలామందికి ఎందులో అయినా పెట్టుబడి పెట్టేముందు ఏమైనా రిస్క్ ఉంటుందా? ఇన్వెస్ట్ చేయడం సేఫేనా మార్కెట్ రిస్క్ ఏమైనా ఉంటుందా? అనే సందేహం ఎక్కువగా వస్తుంటుంది. మీరు పోస్టాఫీసులో పెట్టుబడి పెడితే ఎలాంటి నష్టాలు ఉండవు. అందుకే చాలా మంది పోస్టాఫీస్ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
పోస్టాఫీస్ అందించే పథకాల్లో నెలవారీ ఆదాయ పథకం (MIS) ఒకటి. సురక్షితమైన పెట్టుబడితో మంచి నెలవారీ రాబడిని పొందవచ్చు. ఈ పథకం ప్రస్తుతం 7.4శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఏడాది వరకు మీరు ఫండ్స్ విత్ డ్రా చేయలేరు. మీరు ఈ పథకంలో కేవలం రూ. 1,000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు.
ఎలా పెట్టుబడి పెట్టాలి? :
ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్. ఇందులో మొత్తం పెట్టుబడి ఒకేసారి పెట్టాలి. ఒకే అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంటులో రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన మొదటి నెల నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ నెలవారీగా చెల్లిస్తుంది. మీరు నెలవారీ వడ్డీని ఒకవేళ తీసుకోకపోతే ఆ వడ్డీపై ఎలాంటి అదనపు వడ్డీ రాదు.
ప్రతి నెలా రూ. 9250 వడ్డీ :
మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీ రేటు 7.4శాతం ప్రకారం మీరు నెలకు సుమారు రూ. 9,250 వడ్డీని సంపాదించుకోవచ్చు. మీకు దగ్గరలోని పోస్టాఫీసును విజిట్ చేసి ఈ పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
Disclaimer : పోస్టాఫీసులో పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇందులో పెట్టుబడి పెట్టేముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణులు లేదా దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.
