Gold and silver Price,
Gold And Silver Price: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల ఎఫెక్ట్ బంగారం ధరలపై చూపుతుంది. దీంతో ఎప్పుడూలేని విధంగా గోల్డ్ రేటు పరుగులు పెడుతోంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన టారిఫ్ విధానాల వల్ల బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరగడంతో పెట్టుబడి దారులు సురక్షిత ఆస్థిగా ఉన్న బంగారంవైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్సు గోల్డ్ రేటు 3,133 డాలర్లకు చేరింది. సోమవారంతో పోల్చితే ఒక్కరోజులోనే 20డాలర్లకుపైగా పెరిగింది. వెండి ధర ఓన్సుకు 34 డాలర్ల దాటి ట్రేడింగ్ అవుతోంది. ట్రంప్ దూకుడుకు బ్రేకులు పడకుంటే వచ్చే వారం రోజుల్లో ఔన్సు గోల్డ్ రేటు 3,200 డాలర్ల మార్క్ ను దాటే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలోనూ బంగారం ధర సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.930 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.850 పెరిగింది. మరోవైపు వెండి ధర రూ. వెయ్యి పెరిగింది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాలతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఇవాళ్టి ధరలు ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.85,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.92,840 మార్క్ కు చేరింది
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.92,990 మార్క్ కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 85,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.92,840కి చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. కిలో వెండిపై వెయ్యి రూపాయలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,100 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,14,000 మార్క్ కు చేరింది.