Gold Rate Today: బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై..
- Harishth Thanniru
- Published On : June 20, 2025 / 10:36 AM IST
Gold price
Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు గుడ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది. వెండి ధరసైతం భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే, ఇవాళ గోల్డ్ రేటు భారీగా తగ్గింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 600 తగ్గింది.. 22 క్యారెట్ల గోల్డ్ పై రూ. 550 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఓన్స్ గోల్డ్ 18డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 3,356 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరకూడా భారీగా తగ్గింది. భారత దేశంలో కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. అయితే, ఏపీ, తెలంగాణతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే..
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.92,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,480 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,250కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,630కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.92,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,00,480 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 మార్క్‌కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
