Gold Rate: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందంటే..?

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై ..

Gold

Gold Rate: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. వరుసగా రెండ్రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. గోల్డ్ రేటుతోపాటు వెండి ధరసైతం తగ్గింది.

 

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.380 తగ్గగా, 22 క్యారట్ల బంగారంపై రూ. 350 తగ్గింది. మరోవైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ 23 డాలర్లు పెరిగి 3,320 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.89,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,530కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,680కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 89,400 కాగా.. 24క్యారెట్ల ధర రూ.97,530కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,000 కు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.