Gold Prices: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. మళ్లీ తగ్గిన ధరలు.. హైద‌రాబాద్‌, విజయవాడలో తులం గోల్డ్ రేటు..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ..

Gold

Gold And Silver Price: బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లీ మార్కెట్లోకి తరలిస్తుండటంతో మళ్లీ గోల్డ్ రేటు దిగొస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.160 తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో 24 క్యారట్ల బంగారంపై రూ. 1040 తగ్గింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గుతుంది. గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ. 4,100 తగ్గింది.

గత కొంతకాలంగా అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో గత నాలుగు రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ వస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,018కి దిగొచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 33 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.82,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,620కి దిగొచ్చింది.

దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,770 వద్ద కొనసాగుతుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 82,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.89,620 వద్దకు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,09,900 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000గా నమోదైంది.