Gold
Gold And Silver Price: బంగారం కొనేందుకు సిద్ధమైన వారికి బిగ్ షాక్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఫలితంగా 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర మళ్లీ రూ.90వేల మార్క్ ను దాటేసింది. ఇటీవల వరుసగా తగ్గిన గోల్డ్ రేటు.. మళ్లీ ఒక్కసారిగా పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాల ప్రకటన నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,140 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,050 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 3వేలు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటులో ఒక్కసారిగా భారీ పెరుగుదల చోటు చేసుకుంది. గురువారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10గ్రాములు) 3,032 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ (శుక్రవారం) ఔన్సు గోల్డ్ రేటు 3,080 డాలర్లకు చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఓన్సుకు 34 డాలర్ల దాటి ట్రేడింగ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.83,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,980కి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.91,130కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 83,400 కాగా.. 24క్యారెట్ల ధర రూ.90,980 వద్దకు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,000 మార్క్ కు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,000గా నమోదైంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,14,000 మార్క్ కు చేరింది.