Gold
Gold Price Today: ఇటీవల కాలంలో వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేటు మళ్లీ పుంజుకుంటోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ.540 పెరగ్గా.. 22క్యారట్ల గోల్డ్ పై రూ.500 పెరిగింది. సోమ, మంగళవారాల్లోనూ బంగారం ధర పెరిగింది. దీంతో మూడు రోజుల్లో 10గ్రాముల 24క్యారట్ల పై రూ.3,490 పెరిగింది. బుధవారం వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.3,100 పెరిగింది.
బంగారం ధర పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా గోల్డ్ రేటు పెరుగుతోంది. పెట్టుబడిదారులు బంగారాన్ని మంచి అప్షన్ గా చూస్తున్నారు. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెంపు, వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడ్ రిజర్వ్‌పై ఒత్తిడితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర రిజర్వ్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని వల్ల కూడా బంగారం ధర పెరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.90,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,000 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,150కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 90,750 కాగా.. 24క్యారెట్ల ధర రూ.99,000కు చేరుకుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,11,000 వద్దకు చేరింది.
Note: పైన పేర్కొన్న ధరలు ఉదయం 10గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరలు రోజులో పలు దఫాలుగా మారుతుంటాయి. ఖచ్చితమైన ధరల కోసం నగల దుకాణంలో లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి.