Gold Price Today : దేశవ్యాప్తంగా రాఖీ సందడి.. బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర
- Harishth Thanniru
- Published On : August 18, 2024 / 07:06 AM IST
Gold
Gold And Silver Price Today : దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ సందడి నెలకొంది. సోమవారం రాఖీ పండగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. పలువురు తమ సోదరులకు బంగారం రాఖీలు కడుతుంటారు. రాఖీలు కట్టే అక్కాచెల్లెళ్లకు పలువురు బంగారు నగలు బహుమతులుగా ఇస్తుంటారు. దీంతో పలు ప్రాంతాల్లోని బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బంగారం ధర పలు ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గగా.. పలు ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు.. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,770.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,920.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,770.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,770 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 91,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 86,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులోనూ కిలో వెండి ధర రూ. 86,000 వద్ద కొనసాగుతుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
