Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా? పూర్తి వివరాలు ఇలా..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతుండగా.. కిలో వెండి ధర రూ. 93వేల వద్ద కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,040.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,190.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,950 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.73,040.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,950 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,040 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా ఆదివారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.93,000 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.93,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 88,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు