Gold Price Today : తగ్గిన బంగారం.. భారీగా పెరిగిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
- Harishth Thanniru
- Published On : August 27, 2024 / 12:00 PM IST
Gold And Silver Price Today
Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.600 పెరిగింది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,940 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,030.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,090 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,180.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,940 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.73,030.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,940 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,030 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.600 పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.93,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.93,500.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 88,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 400 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.
పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
