Gold Rate : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేటు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
- Harishth Thanniru
- Published On : March 31, 2024 / 10:25 AM IST
Gold
Gold Rate in Hyderabad : బంగారం కొనుగోలు దారులకు స్వల్ప ఊరట లభించింది. గత నాలుగు రోజుల్లో బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. కాగా, శనివారం గోల్డ్ రేటు కాస్త తగ్గగా.. ఆదివారం స్థిరంగా కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర వరుసగా మూడ్రోజులు పెరగ్గా.. ఆదివారం వెండి ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,750 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 68,450 వద్ద కొనసాగుతుంది. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 68,600.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 62,750 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,450.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.63,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.69,490.
- స్థిరంగా వెండి ధర ..
దేశం వ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.81,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 81,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.78,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.77,000 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
