Gold
Gold and Silver Rate Today 5th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఫలితంగా పది రోజుల్లో 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 3వేల వరకు తగ్గుదల చోటు చేసుకుంది. రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో దసరా, దీపావళి పండుగల సందడి మొదలైంది. దీంతో బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు వారికి ఊరటనిస్తున్నాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 10 తగ్గగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ పైనా రూ. 10మేర తగ్గుదల చోటు చేసుకుంది. వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గుదల చోటు చేసుకుంది.
Gold
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గురువారం 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 52,590కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 57,370కి పడిపోయింది.
gold
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
– దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పుచోటు చేసుకోలేదు. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 52,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 57,530 వద్ద కొనసాగుతోంది.
– చెన్నైలో 10 గ్రాముల బంగారంపై రూ. 50 నుంచి 60 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రూ.52,850 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.57,650 కి పడిపోయింది.
– బెంగళూరు, కోల్‌కత్తా, ముంబయి వంటి నగరాల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 10 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో ఆ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 52,590కాగా. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 57,370 గా నమోదైంది.
Gold
స్వల్పంగా తగ్గిన వెండి ధర..
దేశ వ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 300 నుంచి 400 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 73,100 వద్దకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలైన చెన్నైలో కిలో వెండి ధర రూ. 73,100 కాగా, ముంబయి, ఢిల్లీ, కోల్ కతాలలో రూ.70,700కు చేరింది. బెంగళూరులో వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఫలితంగా కిలో వెండి రూ. 69,000 వద్ద కొనసాగుతోంది.