×
Ad

2026లో బంగారంపై పెట్టుబడి పెడితే మీపై డబ్బుల వర్షం కురుస్తుందా? లేదంటే వెండిపైనా..?

ఇప్పటికే వీటిపై పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడిని విక్రయించకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు పెద్ద మొత్తాలకంటే చిన్న సిస్టమాటిక్ కొనుగోళ్ల ద్వారా ప్రవేశించాలని చెబుతున్నారు.

Gold: గోల్డ్, సిల్వర్ ధరలు గణనీయంగా పెరిగాయి. 2026లోనూ ఇవి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తాయని అంచనా. 2025లో ఈ విలువైన లోహాలు విపరీతంగా లాభాలు చూపాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఆందోళనలు, ద్రవ్య విధాన అంచనాల ప్రభావంతో 2026లో కూడా ఇదే తీరు కొనసాగుతుందని నిపుణుల అంచనా.

ద్రవ్యోల్బణం, ఎఫ్‌ఎక్స్ (విదేశీ మారకద్రవ్య మార్కెట్) అస్థిరత, భౌగోళిక రాజకీయ ఆందోళనల వేళ సురక్షిత దీర్ఘకాల పెట్టుబడికి బంగారం, వెండి సానుకూలంగా ఉంటాయి. ఇప్పటికే వీటిపై పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడిని విక్రయించకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు పెద్ద మొత్తాలకంటే చిన్న సిస్టమాటిక్ కొనుగోళ్ల ద్వారా ప్రవేశించాలని చెబుతున్నారు.

గోల్డ్‌తో పోల్చితే సిల్వర్ అధిక అస్థిరతను చూపుతుంది. పెట్టుబడి డిమాండ్, పారిశ్రామిక డిమాండ్ కారణంగా ఎక్కువ లాభాల అవకాశాలు ఉన్నాయి. అధిక రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకునే పెట్టుబడిదారులు సిల్వర్ వైపు చూడవచ్చు.

Also Read: 3,500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని సముద్రగర్భం నుంచి కొట్టిపడేయొచ్చు.. కే-4 మిసైల్‌ పరీక్ష సక్సెస్‌.. ఇక భారత్‌ చేతిలో..

పెట్టుబడిదారులు మొత్తం పోర్ట్‌ఫోలియోలో (మొత్తం పెట్టుబడిలో) 10-20 శాతం గోల్డ్ లేదా సిల్వర్‌లో పెడితే నష్టాల ప్రమాదం తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి కొంత రక్షణ లభిస్తుంది.

గోల్డ్ ధరలు ఇలాగే పెరిగే అవకాశం ఉందని అనేక అంచనాలు సూచిస్తున్నాయి. 2026 ఏడాది చివరినాటికి గోల్డ్ ధరలు భారీగా పెరిగిపోవచ్చు. గోల్డ్‌తో పోలిస్తే సిల్వర్ ధరల శాతం లాభాల పరంగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దీనికి పరిశ్రమల నుంచి బలమైన డిమాండ్, మార్కెట్‌లో సరఫరా పరిమితంగా ఉండటం కారణాలుగా నిలుస్తాయి. సిల్వర్‌లో అధిక అస్థిరత ఉంటుంది కాబట్టి ధరలు వేగంగా పైకి ఎగిరే అవకాశం ఉంటుంది. ఈ విశ్లేషణ ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు.