Gold Prices
Gold Prices : పెళ్ళిళ్లు, శుభకార్యాలు, పండుగలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. అయితే, ఇటీవల కాలంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉధ్రిక్తతలు కారణంగా వీటి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. (Gold Prices)
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఔన్సు గోల్డ్ 3,400 డాలర్ల స్థాయికి దిగువన కదులుతుండగా.. తదుపరి మద్దతు 3,340 డాలర్ల వద్ద ఉండొచ్చని అంచనా. అయితే, తాజా పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే నెలలో గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,150 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,01,620 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,770 వద్దకు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,150 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,01,620కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,30,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,20,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,30,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.