అంతర్జాతీయంగా కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ ఉదయం నాటికి మాత్రం 2,910 డాలర్ల కంటే తక్కువకు చేరాయి. యూఎస్ యీల్డ్స్ పెరగడమే అందుకు కారణం. యూఎస్ యీల్డ్స్ అంటే ప్రభుత్వ బ్లాండ్లపై రిటర్న్స్. సమీప భవిష్యత్తులోనూ బంగారం ధరల కాస్త తగ్గవచ్చని తెలుస్తోంది. దీని ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
జియోపాలిటికల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా కొంత మేరకు బంగారం రేట్లు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. యూస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) ఫిబ్రవరి నాన్-ఫార్మ్ పేరోల్స్ (NFP) నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్థిక వ్యవస్థ బాగుండడంతో జనవరిలో కంటే ఫిబ్రవరిలో అధిక మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిపుణులు ఊహించిన దానికంటే తక్కువ ఉద్యోగాలు వచ్చాయి.
దీనిపై ఫెడరల్ రిజర్వ్ (Fed) గవర్నర్ ఆడ్రియానా కుగ్లర్ మాట్లాడుతూ.. అర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల ప్రతి ఒక్కరిపైనా ఈ ప్రభావం పడుతుందని తెలిపారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, ఆర్థిక విధానం కొంతకాలం స్థిరంగా ఉంటాయని చెప్పారు.
ఇటీవలే ఫెడ్ ఛైర్మన్ ‘జెరోమ్ పౌల్’ వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ తొందరపడదని మరోసారి స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణ లక్ష్యం 2% చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని, ఒకటి లేదా రెండు డేటా రీడింగ్స్‌పై అధికంగా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్‌పై ఒత్తిడి పెంచుతూ బందీలను విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ విధంగా జియోపాలిటికల్ ఉద్రిక్తతలు తగ్గడం కొంత మేరకు బంగారం రేటు తగ్గుదలపై ప్రభావం చూపుతాయి.
కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) 2025 మొదటి రెండు నెలల్లో 10 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే, అత్యధిక కొనుగోలు చేసినది మాత్రం నేషనల్ బ్యాంక్ అఫ్ పోలాండ్ (NBP). ఇది 29 టన్నులు కొనుగోలు చేసింది. 2019 జూన్‌లో 95 టన్నులు కొనుగోలు చేసిన తర్వాత ఇదే అతిపెద్ద లావాదేవీ.
బంగారం మార్కెట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయంటే?