Gold Price Today : బంగారం కొనేవారికే ఇక చుక్కలే.. పసిడి ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

Gold Price Today April 1 : బంగారం ధరలు మళ్లీ భగ్గుంటున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఎగసిపడుతున్నాయి. ఏప్రిల్ 1న బుధవారం బంగారం ధరలు ప్రధాన నగరాల్లో ఎంత పెరిగాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..

1/11
Gold Price Today April 1 : బాబోయ్ మళ్లీ బంగారం కొండెక్కింది.. మొన్నటివరకూ తగ్గినట్టి తగ్గిన బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనేందుకు చూస్తుంటారు. బంగారం తగ్గింది ఇప్పుడే కొనేసుకోవడం బెటర్ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం ప్రియులకు పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
2/11
ఇరాన్ యుద్ధం ఉద్రికత్త ఉన్నప్పటికీ బంగారం దేశీయంగా బంగారం తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, బంగారం కొనేవారికి మళ్లీ ధరలు భారంగా మారుతున్నాయి.
3/11
ఏప్రిల్ 1 బుధవారం దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
4/11
దేశీయ బంగారం ధరల ప్రకారం.. ఒక గ్రాము గోల్డ్ ధర రూ.197 పెరిగి రూ.15,148 వద్ద కొనసాగుతోంది. 22 క్యారట్ల గ్రాము గోల్డ్ ధర రూ.180 పెరిగి రూ.13,885 వద్ద కొనసాగుతోంది.
5/11
100 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 19,700 పెరిగి రూ.15,14,800 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు రూ.18వేలు పెరిగి రూ. 13,88,500 వద్ద కొనసాగుతోంది.
6/11
హైదరాబాద్ సిటీలో ఈరోజు బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1970 పెరిగి రూ.1,51,480 దగ్గర కొనసాగుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1800 పెరిగి రూ.1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
7/11
విజయవాడలో ఈరోజు బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాములకు 24 క్యారట్ల గోల్డ్ ధర రూ.1970 పెరిగి రూ.1,51,480 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1800 పెరిగి రూ.1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
8/11
విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలను చూస్తే.. 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1970 పెరిగి రూ.1,51,480 వద్ద పలుకుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1800 పెరిగి రూ.1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది.
9/11
చెన్నై నగరంలో 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,53,270 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,500 వద్ద పలుకుతోంది.
10/11
ముంబైలో గోల్డ్ ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1970 పెరిగి రూ.1,51,480 వద్ద పలుకుతోంది. 10 గ్రాములకు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1800 పెరిగి రూ.1,38,850 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాములకు 18 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,480 పెరిగి రూ.1,13,610 వద్ద ట్రేడ్ అవుతోంది.
11/11
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,51,630 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్లకు 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,000 వద్ద ట్రేడ్ అవుతోంది.