Gold Price Today : గోల్డ్ మార్కెట్లో భారీ ట్విస్ట్.. ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. రూ. 10వేలు తగ్గిన వెండి.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today April 2 : బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా రూ. 10వేలు తగ్గాయి. ఏప్రిల్ 2న గురువారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published On : April 2, 2026 / 12:59 PM IST
Gold Price Today April 2 : బంగారం కొనేవారికి బంగారం లాంటి వార్త.. బంగారం నిన్న పెరిగింది.. ఇవాళ తగ్గింది.. బంగారం ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు మళ్లీ పెరుగుతుందో చెప్పడం కష్టమే. రెండు లక్షలకు చేరువగా దూసుకెళ్లిన బంగారం అంతే స్థాయిలో దిగుతూ వస్తోంది. గత రెండు రోజులుగా కొండెక్కిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం కూడా తగ్గడంతో బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు డాలర్ విలువ పెరగడంతో బంగారం మళ్లీ దిగొచ్చింది. ఇన్వెస్టర్లు కూడా డాలర్ వైపు మొగ్గుచూపడంతో కొండెక్కిన పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 2న బులియర్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లో ఏప్రిల్ 2 (గురువారం) పసిడి ధరల ప్రకారం.. 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ ధర రూ.153 తగ్గి రూ.15,142 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.140 తగ్గి రూ.13,880 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ 100 గ్రాముల ధర రూ. 15,300 తగ్గి రూ.15,14,200 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములు రూ.14వేలు తగ్గి రూ. 13,88,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ సిటీలో బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1530 తగ్గి రూ.1,51,420 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1400 తగ్గి రూ.1,38,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో గోల్డ్ ధరల ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల పసిడి ధర రూ.1530 తగ్గి రూ.1,51,420 దగ్గర కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1400 తగ్గి రూ.1,38,800 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,140 తగ్గి రూ.1,13,570 వద్ద ట్రేడ్ అవుతోంది.
విశాఖలో గోల్డ్ ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1530 తగ్గి రూ.1,51,420 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1400 తగ్గి రూ.1,38,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,51,570 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,38,950 వద్ద ఉంది.
Gold Price Today April 2
ముంబైలో గోల్డ్ ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1530 తగ్గి రూ.1,51,420 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1400 తగ్గి రూ.1,38,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,180 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
రూ. 10వేలు తగ్గిన వెండి ధర : మరోవైపు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. బుధవారం రూ. 2,65,000 ఉన్న కిలో వెండి ధర ఈరోజు ఏకంగా రూ. 10వేలు తగ్గి రూ. 2,55,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
