gold
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 53 శాతం పెరిగాయి. 2026లో 15 నుంచి 30 శాతం మధ్య పెరగవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. అమెరికా టారిఫ్‌లతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ పసిడిలో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి.
ఇన్వెస్టర్లు దీనిపై ఆసక్తి చూపడంతో పాటు పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లు చేస్తున్నాయి. అలాగే, ఆయా దేశాల బ్యాంకులు కీలక వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు బంగారం ధరలు పెరిగేందుకు దోహదం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానపర నిర్ణయాలు విజయవంతమైతే బంగారం ధరలు తగ్గుముఖం పట్టవచ్చని డబ్ల్యూజీసీ చెప్పింది.
Also Read: గుడ్‌న్యూస్.. టోల్‌ప్లాజాల వద్ద ఒక్క సెకన్ కూడా ఆగాల్సిన పనిలేదు
బంగారం ధర పెరుగుదలలో ఈటీఎఫ్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించింది. ఈ విధానంలో భారీగా పసిడిని కొనుగోలు చేస్తున్నారని చెప్పింది. గ్లోబల్‌గా బంగారం ఈటీఎఫ్‌ల్లోకి సుమారు రూ.6,93,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పింది. భవిష్యత్‌లో కూడా బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు మరింత పెరిగవచ్చని అంచనా వేసింది.