Gold Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి, రూ.52,915గా నమోదైంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.53,005గా ఉంది. మరోవైపు, ఇవాళ కిలో వెండి ధర రూ.374 తగ్గి, రూ.59,166గా నమోదైంది. నిన్న కిలో వెండి ధర రూ.59,540 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు రూ.1,42,543గా ఉంది.

Gold Silver Price: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి, రూ.52,915గా నమోదైంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.53,005గా ఉంది. మరోవైపు, ఇవాళ కిలో వెండి ధర రూ.374 తగ్గి, రూ.59,166గా నమోదైంది. నిన్న కిలో వెండి ధర రూ.59,540 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు రూ.1,42,543గా ఉంది.

అలాగే, ఔన్సు వెండి ధర రూ.1,622గా ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికా డాలర్ విలువ పెరిగిపోతూ ఉండడం బంగారం, వెండి ధ‌ర‌ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090గా ఉంది. కిలో వెండి ధర రూ.64,400గా ఉంది.

Shirdi Saibaba Temple: షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్

ట్రెండింగ్ వార్తలు