ఇండియాలో పెరిగిన గోల్డ్ స్మగ్లింగ్‌.. ధరలు పైపైకి!

  • Publish Date - December 13, 2019 / 10:56 AM IST

దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి ఇండియాలోకి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా అవుతోంది. జూలైలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలపై పన్నును పెంచడమే గోల్డ్ స్మగ్లింగ్ మరింత పెరగడానికి ఊతమిచ్చినట్టుయింది. దీని ప్రభావంతో సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

దేశంలో బంగారం ధరలు పెరగడంతో కస్టమ్స్ అధికారులంతా గోల్డ్ స్మగ్లింగ్ పై ఓ కన్నేసి ఉంచారు. దిగుమతి పన్నులను ప్రభుత్వం పెంచిన తర్వాతే బంగారం దిగుమతి పరిమితికి మించి దేశంలోకి వచ్చి పడుతోంది. కస్టమ్స్ అధికారులు విదేశీల నుంచి దిగుమతి అయ్యే బంగారాన్ని తనిఖీలు చేసి స్వాధీనం చేసుకుంటున్నారు.

విదేశాల నుంచి తిరిగి వచ్చేవారంతా బంగారాన్ని తమ బ్యాగుల్లో, దుస్తుల్లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్నారు. బంగారం అక్రమ రవాణాకు యత్నించినవారిని అధికారులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకే ఒక విమానంలో 30 మంది ప్రయాణికులను అధికారులు అరెస్ట్ చేశారు.

వీరంతా విదేశాల నుంచి చెన్నైకి 7.5 కిలోగ్రాములు (16.5పౌండ్లు) బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. పన్ను రేట్లు పెరిగినప్పటి నుంచి బంగారం స్మగ్లింగ్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే స్మగ్లర్లకు మరింత చేయూతనిస్తోందని దేశీయ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ పీఆర్ సోమసుందరం ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

బంగారం స్మగ్లింగ్ విషయంలో చర్యలు తీసుకునేంత వరకు అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. బంగారం అక్రమ రవాణా రూపుమాపడానికి కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని, గ్రే మార్కెట్లో ట్రేడ్‌కు కూడా సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు.

భారత్ లో 2016 నుంచి బంగారం ధరలపై దిగువ స్థాయిలో కనిపించింది. ఆ తర్వాత సెప్టెంబర్ నెలలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.39వేల 885 (563 డాలర్లు)తో రికార్డు స్థాయికి చేరింది. బంగారం ధర ఉన్నట్టుంటి పెరగడానికి దిగుమతి పన్ను పెంపు, అమెరికా-చైనా ట్రేడ్ యుద్ధం, ద్రవ్య విధానం క్షీణించడమే కారణంగా చెప్పవచ్చు.

దీంతో గ్లోబల్ బెంజ్ మార్కు ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అప్పటినుంచి బులియన్ ఆల్ టై హై నుంచి వెనక్కి తగ్గినప్పటికీ, ఈ ఏడాదిలో 20శాతం మేర పెరిగింది. 2019లో అక్రమ రవాణాగా దేశంలోకి చేరిన బంగారం 30 శాతం నుంచి 40 శాతానికి ఎగిసి 140 టన్నులకు చేరనుంది. 2020లో మరింత పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జ్యుయెలరీ డొమిస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్. అనంత పద్మనాభం తెలిపారు.

ప్రస్తుత ద్రవ్యలోటు భర్తీ చేసేందుకు 2013లోనే దిగుమతి సుంకంపై పన్నును మూడు సార్లు పెంచడం జరిగింది. అప్పటినుంచి స్మగ్లర్లు.. రైళ్లలో, విమానాల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుండటంతో 2014లో 225 టన్నుల బంగారం అక్రమ రవాణా జరిగినట్టు అంచనా.

2018 నుంచి విమానశ్రయాల్లో ఇదే వ్యవధిలో స్వాధీనం చేసుకున్న బంగారం కంటే.. ఈ ఏడాదిలో సెప్టెంబర్, అక్టోబర్ కేవలం రెండు నెలల్లోనే దాదాపు 40శాతానికి పైగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా, తైవాన్, హాంగ్ కాంగ్ దేశాల నుంచి భారత్ కు గోల్డ్ స్మగ్లింగ్ అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు డీఆర్ఐ తెలిపింది.

ఈ కామర్స్ ప్లాట్ ఫాం, కొరియర్ల ద్వారా స్మగ్లర్లు ఈజీగా బంగారాన్ని ఇతర దేశాల నుంచి ఇండియాలోకి స్మగ్లింగ్ చేస్తున్నట్టు రిపోర్టులు తెలిపాయి. మరోవైపు బిలియన్ కూడా భారీగా పెరుగుతోంది. భారత్ పొరుగుదేశాలైన నేపాల్, బూటాన్, మయన్మార్, చైనా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ అవుతోంది.