Kia Syros Discounts : SUV మార్కెట్‌లో హీట్ పెంచిన కియా! సైరోస్‌పై దిమ్మతిరిగే ఆఫర్లు.. ఏకంగా రూ. 50వేల వరకు తగ్గింపు
Kia Syros Discounts : కియా సైరోస్ ఎస్‌యూవీ కారు రూ. 50వేల వరకు మొత్తం తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
- Sreehari A
- Published on- May 13, 2026 / 03:07 PM IST
Kia Syros Discounts ( Image Credit : AI )
- కియా సైరోస్ ఎస్‌యూవీ కార్లపై దిమ్మతిరిగే ఆఫర్లు
- గత ఏడాదిలో కేవలం 2 నెలల్లోనే 15వేల యూనిట్లు
- కియా సైరోస్ ఎస్‌యూవీలపై రూ. 50వేల వరకు భారీ తగ్గింపు
Kia Syros Discounts : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? కియా సైరోస్ ఎస్‌యూవీ రూ. 50వేల వరకు భారీ తగ్గింపుతో లభిస్తోంది. చాలా కాలంగా కియా నుంచి ఈ సబ్-4 మీటర్ల ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్న కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం. ఈ ఆఫర్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
లాంచ్ దగ్గర నుంచి భారత మార్కెట్లో కియా అమ్మకాలు జోరందుకున్నాయి. ఏప్రిల్ 2025లో కేవలం 2 నెలల్లోనే 15వేల యూనిట్లు (Kia Syros Discounts) అమ్ముడయ్యాయి. కియా ఇటీవల 2026 కోసం ఈ ఎస్‌యూవీని అప్‌డేట్ చేసింది. దాంతో ఈ కారు ధరలు రూ. 8.40 లక్షల నుంచి రూ.15.80 లక్షల (ఎక్స్-షోరూమ్ ధరలు) వరకు ఉన్నాయి. డీలర్‌షిప్, సిటీ, వేరియంట్ స్టాక్‌ను బట్టి ఈ ఆఫర్‌లు మారుతాయి.
కియా సైరోస్‌పై భారీ డిస్కౌంట్లు :
ఈ ఆఫర్లు కొత్త కొనుగోలుదారులను కియా SUVలపై ఆకర్షించేందుకు తమ పాత వాహనాలను ఎక్స్చేంజ్ చేసుకునేవారికి ఎక్కువగా బెనిఫిట్ అందుతుంది. ఈ ఆఫర్లు వివిధ కేటగిరీలలో విస్తరించి రూ. 50వేల వరకు మొత్తం బెనిఫిట్ అందిస్తాయి.
Read Also : Motorola Razr Fold : ఇది ఫోన్ కాదు బ్రో.. లగ్జరీ స్టేటస్ సింబల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ ధర వింటే నమ్మలేరు!
రూ. 10వేల క్యాష్ డిస్కౌంట్ :
మీ ప్రస్తుత కారును కొత్త దానితో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 20వేలు బెనిఫిట్ పొందవచ్చు. మీ పాత వాహనాన్ని స్క్రాప్ చేయడం ద్వారా ప్రభుత్వ స్వచ్ఛంద వాహన సముదాయ ఆధునీకరణ పథకం కింద రూ. 20వేలు అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
కియా సైరోస్ ధర :
కియా ఎస్‌యూవీలో ఇటీవల అనేక మార్పులు జరిగాయి. ఇందులో లైనప్‌ను 7 ప్రధాన ట్రిమ్‌లుగా విభజించారు. HTE, HTE (O), HTK EX, HTK+, HTK+ (O), HTX, HTX(O) అప్‌డేట్ చేసిన మోడళ్ల ధరలు రూ. 8.40 లక్షల నుంచి ప్రారంభమై (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు) రూ. 15.80 లక్షల వరకు ఉంటాయి.
ఇటీవలి ఆఫర్లలో కియా ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 8 లక్షల లోపునకు చేరుకుంది. సరసమైన ధరలో మంచి ఫీచర్లున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తున్న యూజర్లకు అద్భుతమైన ఆప్షన్.
కియా సైరోస్ ఇంజిన్ :
సైరోస్ ఎస్‌యూవీ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ త్రీ-సిలిండర్ ఇంజన్ లేదా 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ 116 హెచ్‌పీ 172 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేయగా, డీజిల్ ఇంజన్ 112 హెచ్‌పీ 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ 7-స్పీడ్ డీసీటీ ఉన్నాయి.
కియా సైరోస్ ఫీచర్లు :
ఈ SUV కారులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్టు ఇచ్చే 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 64-రంగుల యాంబియంట్ లైటింగ్ 5-అంగుళాల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
సేఫ్టీ కోసం సైరోస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఉన్నాయి.
