×
Ad

High Credit Score : గుడ్ న్యూస్.. మీ క్రెడిట్ స్కోరు ఎంత? ఇలాంటి వారికి బ్యాంకులు వద్దన్నా లోన్లు ఇస్తాయి.. తక్కువ వడ్డీ, ఎక్కువ బెనిఫిట్స్!

Credit Score : మీ క్రెడిట్ స్కోరు 780 దాటిందా? హై క్రెడిట్ స్కోరుతో బ్యాంకులు త్వరగా లోన్లు ఇస్తాయి. వడ్డీ కూడా తక్కువే ఉంటుంది. అప్లయ్ చేయడమే ఆలస్యం వెంటనే లోన్లు అప్రూవల్ వస్తాయి.. క్రెడిట్ స్కోరు తగ్గితే ఈ ప్రయోజనాలు పొందలేరు.

  • Published On : February 21, 2026 / 05:26 PM IST

Credit Score

  • హై క్రెడిట్ స్కోరు ఉన్నవారికి ఎక్కువ లోన్ ఆఫర్లు, మరెన్నో బెనిఫిట్స్
  • క్రెడిట్ స్కోరు 750 దాటితే లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు క్యూ
  • తక్కువ వడ్డీతో లోన్లు, క్రెడిట్ కార్డులు కూడా హై లిమిట్ పొందొచ్చు

High Credit Score : మీ క్రెడిట్ స్కోరు ఎంత? చాలామంది హోం లోన్, కారు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేస్తుంటారు. అయితే, కొంతమందికి క్రెడిట్ స్కోరు సరిగా లేకుండా ఎలాంటి లోన్లు పొందలేరు. కనీసం క్రెడిట్ కార్డు కూడా ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపించవు.

క్రెడిట్ స్కోరు అనేది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ప్రతి ఆర్థికపరమైన విషయాలకు క్రెడిట్ స్కోరు తప్పనిసరిగా మారింది. అందుకే మీ క్రెడిట్ స్కోర్‌ ఎంత ఉందో ముందుగానే చెక్ చేసుకోవాలి. కానీ, క్రెడిట్ స్కోరు గురించి అవగాహన లేని చాలామంది పెద్దగా పట్టించుకోరు.

వాస్తవానికి, క్రెడిట్ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణ ఏంటో తెలియజేస్తుందని నిపుణులు అంటున్నారు. మంచి క్రెడిట్ స్కోరు ఉండటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. అందులోనూ మీకు 750కు పైగా ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే మరి మంచిది.. మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

ఒకవేళ, మీ క్రెడిట్ స్కోరు 750 లేదా 780కి దాటిందా? అలా అయితే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. హై క్రెడిట్ స్కోరుతో మీరు బ్యాంకు లేదా NBFC నుంచి మీ లోన్ వడ్డీ రేటుపై తగ్గింపు  పొందవచ్చు. ఇతర నిబంధనలు, షరతులపై రాయితీలను కూడా అడగవచ్చు. క్రెడిట్ స్కోరుతో ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Volkswagen Tayron : ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్.. పవర్, సేఫ్టీ, లగ్జరీ ఒకే కారులో.. 7-సీటర్ వోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్‌ వచ్చేసింది.. ధర ఎంతంటే?

లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి : 
బ్యాంకులు హై క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్ల నుంచి లోన్ అప్లికేషన్లపై ఎక్కువ ఆసక్తి చూపుతాయి ఎందుకంటే.. ఇలాంటి కస్టమర్లకు లోన్లు ఇవ్వడం తక్కువ రిస్క్‌గా భావిస్తాయి. కస్టమర్లు తమ హై క్రెడిట్ స్కోర్‌లతో బ్యాంకు లేదా NBFC నుంచి తక్కువ వడ్డీ రేట్లను డిమాండ్ చేయవచ్చు.

మీరు బ్యాంకుతో మాట్లాడొచ్చు :

ఉదాహరణకు.. రెండు బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ ఆమోదిస్తే.. మీరు ఒక బ్యాంకు ఆఫర్‌ను మరో బ్యాంకుకు చూపించవచ్చు. మీరు వడ్డీ రేటులో రాయితీని అడగవచ్చు. బ్యాంకులు హై క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్‌లను కోల్పోకూడదని భావిస్తుంటాయి.

మరోవైపు, క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే.. అదే బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. అదేవిధంగా, బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకే అడ్వాన్స్ లోన్ ఆఫర్లను పంపుతుంటాయి. హై క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వ్యక్తులకు బ్యాంకులు పిలిచి మరి లోన్లు ఆఫర్ చేస్తుంటాయి.

అప్లయ్ చేయకుండానే వారి క్రెడిట్ కార్డులను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. ఈ ఆఫర్లు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరం పడితే అడ్వాన్స్ అప్రూవల్ లోన్ ఆఫర్ పొందవచ్చు. కస్టమర్‌లు తక్కువ వడ్డీ రేటుకే లోన్లు పొందవచ్చు. తక్కువ క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లకు వారు అప్లయ్ చేసుకున్న తర్వాత కూడా లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడవు.

అధిక క్రెడిట్ స్కోరు బెనిఫిట్స్ :
భారత్‌లో ఇతర సర్వీసులకు సంబంధించి కూడా ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసే పద్ధతి పెరుగుతోంది. ఈ పద్ధతి ఇప్పటికే విదేశాలలో ఉంది. చాలా మంది ఇంటి యజమానులు ఇల్లు అద్దెకు తీసుకునే ముందు ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే ఇంటిని అద్దె తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు హై క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్లకు మాత్రమే బెస్ట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.