Volkswagen Tayron : ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్.. పవర్, సేఫ్టీ, లగ్జరీ ఒకే కారులో.. 7-సీటర్ వోక్స్వ్యాగన్ టేరాన్ R-లైన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
Volkswagen Tayron : భారత మార్కెట్లో వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ లాంచ్ అయింది. ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్ మొదలయ్యాయి. ఈ లాంచ్‌తో ఆటోమేకర్ ప్రీమియం 3-వరుసల SUV కేటగిరీలోకి ప్రవేశించింది. ధర రూ. 46.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు.
Volkswagen Tayron R Line
- భారత మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ వచ్చేసింది
- టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీగా 7 సీటర్ కారు
- రూ. 46.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్
- ఈ మోడల్ ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభం
Volkswagen Tayron : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వోక్స్వ్యాగన్ నుంచి సరికొత్త టేరాన్ ఆర్-లైన్ కారు వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో 7 సీటర్ కారును
రూ. 46.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేసింది. లాంచ్ తర్వాత కంపెనీ ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.
ఆటోమేకర్ ప్రీమియం 3 వరుసల SUV విభాగంలోకి ప్రవేశించింది. ఈ ఫ్లాగ్షిప్ 7 సీట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న కస్టమర్లు అధీకృత డీలర్ల వద్ద లేదా వోక్స్వ్యాగన్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా బుకింగ్ కోసం రూ. 51వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ ఇంజిన్ :
భారత మార్కెట్లో టేరాన్ ఆర్-లైన్ టిగువాన్ ఆర్-లైన్‌తో షేర్ చేసే MQB EVO ప్లాట్‌ఫామ్‌పై రూపొందింది. ఈ 3 వరుసల SUV 2.0-లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ అందిస్తుంది. 204hp, 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG, 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. వోక్స్వ్యాగన్ ప్రకారం.. SUV 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని పొందగలదు. గరిష్టంగా 224 కిమీ/గం వేగాన్ని పొందవచ్చు.
వోక్స్వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్ డిజైన్ :
మార్కెట్ లొకేషన్ అనుగుణంగా టేరాన్ ఆర్-లైన్ ఫుల్ లోడ్ మోడల్‌గా రన్ అవుతుంది. అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. ఎక్స్‌ట్రనల్ డిజైన్ ఐక్యూ లైట్ HD మ్యాట్రిక్స్ హెడ్లైట్లు, ఆర్-లైన్ డిజైన్ స్పెసిఫికేషన్లు, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్రంట్, బ్యాక్ లోగోతో వస్తుంది. వోక్స్వ్యాగన్ SUV ట్రేడేషనల్ SUV రేషియోతో ప్రీమియం జర్మన్ డిజైన్ స్కిల్ కూడా పేర్కొంది.

Volkswagen Tayron R Line
వోక్స్వ్యాగన్ ఇంటీరియర్, ఫీచర్లు :
టేరాన్ ఆర్-లైన్ ఇంటీరియర్ కంఫర్ట్, స్పేస్‌పై దృష్టి సారించింది. ఇందులో కంఫర్ట్ లేఅవుట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎర్గోనామిక్‌గా డిజైన్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌లో 15-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి.
ఫ్రంట్ సీట్లలో మెమరీ ఫంక్షన్, వెంటిలేషన్, మసాజ్, లంబర్ సపోర్ట్‌తో 12-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ డాష్‌బోర్డ్‌లో ఇల్యూమినేటెడ్ R ఇన్సర్ట్తో సహా 30 కలర్ ఆప్షన్లను అందిస్తుంది.
వోక్స్వ్యాగన్ సేఫ్టీ ఫీచర్లు :
సేఫ్టీ పరంగా టేరాన్ ఆర్-లైన్లో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసెంట్, డీసెంట్ అసిస్ట్, డ్రైవర్ ప్రొఫైల్ ఆప్షన్ ద్వారా విభిన్న డ్రైవింగ్ మోడ్లు ఉన్నాయి. ఇంకా, ఇందులో 14 విభిన్న అసిస్ట్ ఫీచర్లతో లెవల్ 2 అడాస్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, జెస్టర్-కంట్రోల్డ్ టెయిల్‌గేట్, 700-వాట్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ హై-పవర్ USB-C పోర్ట్‌లు, వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నాయి.
