Tata Punch EV Facelift : కొత్త టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 468కి.మీ రేంజ్.. ధర జస్ట్ రూ. 9.69 లక్షలే..!
Tata Punch EV Facelift : టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారత మార్కెట్లో పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.
Tata Punch EV Facelift
- భారత మార్కెట్లో టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్
- ప్రారంభ ధర రూ.9.69 లక్షల (ఎక్స్-షోరూమ్)
- సింగిల్ ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు ARAI రేంజ్
Tata Punch EV Facelift : టాటా లవర్స్ కోసం అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారత మార్కెట్లో పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) ఆప్షన్ ధర రూ. 6.49 లక్షలు కాగా, బ్యాటరీ ఛార్జ్ కిలోమీటరుకు రూ. 2.6 ఖర్చు అవుతుంది.
గతంలో, ఆటోమేకర్ మైక్రో SUV మోడల్ ICE (పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్‌లో అనేక మార్పులు చేసింది. బ్యాటరీ ఎలక్ట్రిక్ కారులో కూడా ఇలాంటి మార్పులే చేసింది. కొత్త టాటా పంచ్ ఈవీ కారు పూర్తి ఫీచర్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ :
2026 టాటా పంచ్ ఈవీ అనేక డిజైన్ మార్పులతో వచ్చింది. ముందుగా ఈ SUVకి క్లీనర్ లుక్ ఫ్రంట్ ఫాసియాతో రీడిజైన్ చేశారు. బ్లాక్ లైన్ ఎత్తేశారు. దాని స్థానంలో బాడీ-కలర్ ప్యానెల్‌తో క్లోజ్డ్ ఏరియాను అందించారు. హెడ్లైట్లు, DRL కనెక్టింగ్ ఆప్షన్లు ఇచ్చారు. బంపర్ కూడా చిన్న డిజైన్ మార్పులు చేశారు. టాటా ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లైన నెక్సాన్ ఈవీ, హారియర్ ఈవీల డిజైన్‌కు దగ్గరగా ఉంటుంది.
టాటా పంచ్ ఈవీలో రీడిజైన్ చేసిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సిల్హౌట్ మాదిరిగా ఉన్నప్పటికీ కంపెనీ బ్యాక్ సైడ్ కొత్త టెయిల్‌ల్యాంప్‌లతో అప్డేట్ చేసింది. ఐసీఈ మోడల్ మాదిరిగానే ఈవీలో టెయిల్‌ల్యాంప్‌లను ఇంటిగ్రేటెడ్ టెయిల్‌లైట్ కూడా ఉంది.
ఫియర్లెస్ ఎల్లో, బెంగాల్ రూజ్, కారామెల్ వంటి బాడీ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కారు మొత్తం 7 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ 195mm గ్రౌండ్ క్లియరెన్స్, 450mm వాటర్ వాడింగ్ కెపాసిటీని అందిస్తుంది. ఈ కారు 1360 కిలోల బరువు ఉంటుంది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ :
టాటా పంచ్ ఈవీ లోపలి భాగంలో కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లోగోతో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ అందిస్తుంది. సెంటర్ కన్సోల్‌లో టచ్-ఆపరేటెడ్ కంట్రోల్స్, రోటరీ డయల్ ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లోని లెథరెట్ అప్హోల్స్టరీ, డ్యూయల్-టోన్ షేడ్స్, సెంటర్ కన్సోల్‌లోని రోటరీ డయల్‌తో పాటు మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :
పంచ్ ఈవీలో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్, అనలిటిక్స్, రిమోట్ కమాండ్స్, 3 డ్రైవ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం కారు హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, రియర్ వైపర్, డీఫాగర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, i-TPMS, ISOFIX మౌంట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది.
ఫేస్‌లిఫ్ట్ రేంజ్, బ్యాటరీ :
2026 టాటా పంచ్ ఈవీ 30kWh బ్యాటరీతో వస్తుంది. భారీ 40kWh బ్యాటరీ కూడా అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 468 కిలోమీటర్ల వరకు ARAI రేంజ్ అందిస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే రెండోది కొత్త బ్యాటరీ ప్యాక్ ఆప్షన్. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యాక 7.2kW లేదా 3.3kW ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. 65kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. 26 నిమిషాల్లో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.
ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ :
టాటా పంచ్ ఈవీ లోపల కొన్ని మార్పులు చేసింది. ఇప్పుడు 10-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్రైట్నెస్ లోగోతో రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది. సెంటర్ కన్సోల్‌లో టచ్-ఆపరేటెడ్ కంట్రోల్స్, రోటరీ డయల్ ఉన్నాయి. డాష్‌బోర్డ్‌లోని లెథరెట్ అప్హోల్స్టరీ, డ్యూయల్-టోన్ షేడ్స్, సెంటర్ కన్సోల్‌లోని రోటరీ డయల్‌తో పాటు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు :
పంచ్ ఈవీలో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ సీట్లు, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నావిగేషన్, అనలిటిక్స్, రిమోట్ కమాండ్స్, 3 డ్రైవ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం హిల్ హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, రియర్ వైపర్, డీఫాగర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, i-TPMS, ISOFIX మౌంట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది.
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రేంజ్, బ్యాటరీ :
2026 టాటా పంచ్ ఈవీ 30kWh బ్యాటరీతో వస్తుంది. భారీ 40kWh బ్యాటరీతో వస్తుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే.. 468 కిలోమీటర్ల వరకు ARAI రేంజ్ అందిస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే.. రెండోది కొత్త బ్యాటరీ ప్యాక్ ఆప్షన్. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ తర్వాత 7.2kW లేదా 3.3kW ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. 65kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఉంది. 26 నిమిషాల్లో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.
