Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ప్రతి నెలా రూ. 3500 డిపాజిట్ చేస్తే.. 60 నెలల్లో ఎంత రాబడి వస్తుంది? పూర్తి లెక్కలివే!
Post Office Scheme : పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద లోన్లు తీసుకోవచ్చు. అకౌంట్ కనీసం ఏడాది పాటు రన్ చేయాలి. వరుసగా 12 నెలలు డిపాజిట్లు చేశాక లోన్ పొందవచ్చు.
Post Office RD Scheme
- పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెనిఫిట్స్
- 12 నెలలు ఈ పథకాన్ని కొనసాగిస్తే లోన్ సౌకర్యం
- పోస్టాఫీస్ RD అకౌంట్లపై 6.7శాతం వార్షిక వడ్డీ
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. పోస్టాఫీస్ అందించే అనేక సేవింగ్స్ స్కీమ్‌లలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రభుత్వ పథకాలు కావడంతో ఈ పథకాల్లో పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా అధిక రాబడిని పొందవచ్చు. పోస్టాఫీసు సేవింగ్స్ పథకాల్లో రికరింగ్ (RD) డిపాజిట్ ఒకటి..
ఇది నెలవారీ డిపాజిట్ సేవింగ్స్ స్కీమ్. బ్యాంకుల మాదిరిగానే RD అకౌంట్లను కూడా పోస్టాఫీసులలో ఓపెన్ చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లు, PPF, కిసాన్ వికాస్ పత్ర, టీడీ అకౌంట్లు, MIS వంటి వివిధ రకాల అకౌంట్లను అందిస్తాయి. పోస్టాఫీస్ RD అకౌంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టాఫీస్ RD అకౌంట్లపై 6.7శాతం వార్షిక వడ్డీ :
ప్రస్తుతం పోస్టాఫీస్ RD పథకంపై కస్టమర్లకు 6.7 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. గరిష్ట పెట్టుబడి పరిమితి లేకుండా నెలవారీ రూ. 100 పెట్టుబడితో సేవింగ్స్ పొందవచ్చు. అంటే.. మీకు కావలసినంత డిపాజిట్ చేయవచ్చు. పోస్టాఫీస్‌లో RD అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు ముందుగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి.
Read Also : AI Chat : ఫుడ్ లవర్స్‌కు పండగే.. ఇక AI చాట్‌తో ఫుడ్ ఆర్డర్.. UPIతో పేమెంట్స్.. అన్నీ ఒకే చాట్‌లోనే!
ఆర్డీ అకౌంటులో లోన్ సౌకర్యం :
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద లోన్ కూడా పొందవచ్చు. అకౌంట్ కనీసం ఏడాది పాటు ఉండాలి. వరుసగా 12 నెలలు డిపాజిట్లు చేశాక లోన్ తీసుకోవచ్చు.
పోస్టాఫీస్ ఆర్డీ పథకం కింద మీ RD అకౌంటులో డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణంగా పొందవచ్చు. ఒకేసారి లేదా నెలవారీ వాయిదాలలో రీపేమెంట్ చేయొచ్చు.
పోస్టాఫీస్ ఆర్డీపై 60 నెలల్లో మెచ్యూరిటీ :
పోస్టాఫీస్ ఆర్డీపై 5 ఏళ్లలో లేదా 60 నెలల్లో మెచ్యూరిటీ పొందుతుంది. అవసరమైతే మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. మీరు పోస్టాఫీస్ RD పథకంలో ప్రతి నెలా రూ. 3,500 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,49,776 అందుతుంది. 60 నెలల తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 2,10,000 అయితే, కేవలం వడ్డీనే రూ. 39,776 పొందవచ్చు.
