Google Pixel 9 : బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే గూగుల్ పిక్సెల్ 9 కొనేసుకోండి.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్..!

Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ భారీ తగ్గింపు పొందింది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్లు, డైరెక్ట్ డిస్కౌంట్లతో ఏకంగా రూ. 15వేలు తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 9

Google Pixel 9 Price : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 79,999 ధరకు లాంచ్ కాగా, డైరెక్ట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ధర రూ. 15వేలకు తగ్గింది. ఈ పిక్సెల్ 9 ఫోన్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కొత్త ఫోన్‌ అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం. అతి తక్కువ ధరకే పిక్సెల్ 9 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Reliance Jio : పండగ చేస్కోండి.. 72 రోజుల వ్యాలిడిటీతో జియో కొత్త ప్లాన్.. ఫ్రీగా 20GB హైస్పీడ్ డేటా..!

ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే రిటైల్ ధరపై రూ.5వేల తగ్గింపును ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 9 ధర రూ.74,999కి తగ్గింది. HDFC క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ చెల్లించి అదనంగా రూ. 10వేలు తగ్గింపు పొందవచ్చు. దాంతో కేవలం రూ. 64,999కే కొనుగోలు చేయొచ్చు. అదనపు ఖర్చు లేకుండా 24 నెలల వరకు ఈఎంఐ చెల్లింపులు చేయొచ్చు.

ఎక్స్ఛేంజ్‌తో మరిన్ని డిస్కౌంట్లు :
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్‌తో ట్రేడింగ్ చేస్తే.. రూ.20,600 వరకు తగ్గవచ్చు. కొత్త పిక్సెల్ 9 ధర రూ.44,399కి పడిపోతుంది. అసలు లాంచ్ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 2,700నిట్స్ వరకు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. అంతేకాకుండా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్క్రీన్స్ పగిలిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

హుడ్ కింద గూగుల్ కస్టమ్ టెన్సర్ G4 చిప్ ఉంది. రియల్-టైమ్ ట్రాన్సులేషన్, కెమెరా అప్‌గ్రేడ్స్ వంటి స్మార్ట్ జెమిని ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. 4,700mAh బ్యాటరీ సులభంగా ఫుల్ డే ఉంటుంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌తో త్వరగా రీఛార్జ్ అవుతుంది.

మొబైల్ ఫొటోగ్రఫీ కోసం పిక్సెల్ 9 ఫీచర్లలో 50MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండగా, సెల్ఫీ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14తో రన్ అయ్యే పిక్సెల్ 9 ఫోన్ 7 ఏళ్ల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది.

Read Also : Whatsapp iPhones : బిగ్ అలర్ట్.. ఈ ఆపిల్ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

మీరు 2031 వరకు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్లు, ప్యాచ్‌లను పొందవచ్చు. పిక్సెల్ 9 ఫోన్ కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ డీల్‌ సొంతం చేసుకోవచ్చు. భారీ సేవింగ్స్, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.