Reliance Jio : పండగ చేస్కోండి.. 72 రోజుల వ్యాలిడిటీతో జియో కొత్త ప్లాన్.. ఫ్రీగా 20GB హైస్పీడ్ డేటా..!
Reliance Jio : జియో కొత్త ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 72 రోజుల వరకు వ్యాలిడిటీ, 20GB వరకు ఉచితంగా డేటాను పొందవచ్చు. మరెన్నో బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

Reliance Jio
Reliance Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో 191 మిలియన్ల 5G సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. కంపెనీ కొత్తగా 72 రోజుల ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు 72 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాను పొందవచ్చు. మీరు 20GB అదనపు డేటాను పొందవచ్చు. ఇందులో 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్ వంటి అనేక బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
జియో రిపోర్టు ప్రకారం.. 191 మిలియన్ల 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్యను తాకింది. వాస్తవానికి, గత ఏడాది జూలైలో జియో నెలవారీ ప్లాన్ల ధరలను పెంచేసింది. లాంగ్ వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. జియో ఈ 72 రోజుల ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో మళ్ళీ రీఛార్జ్ చేసుకునే టెన్షన్ ఉండదు. జియో ఈ 72 రోజుల ప్లాన్‌తో ఇకపై అలాంటి సమస్య రాదు. ఒకసారి రీఛార్జ్ చేస్తే 72 రోజుల పాటు మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పని ఉండదు.
జియో కొత్త ప్లాన్ ఏంటి?
28 రోజుల ప్లాన్ తక్కువగా ఉంటే.. 365 రోజుల ప్లాన్ చాలా ఖరీదైనదిగా భావిస్తే.. జియో 72 రోజుల ప్లాన్ తీసుకోవచ్చు. ఈ ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 72 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది.
ఫ్రీ డేటా :
మీ డేటా వినియోగం ఎక్కువగా ఉంటే.. ఈ ప్లాన్ బెస్ట్. మీరు ప్రతిరోజూ 2GB డేటాను పొందవచ్చు. 72 రోజుల ప్రకారం.. 144GB అవుతుంది. మీరు డేటా పొందాలంటే కంపెనీ 20GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ 72 రోజుల ప్లాన్‌లో మీరు మొత్తం 164GB డేటాను పొందొచ్చు.
ఈ ప్లాన్ ధర రూ. 749కు పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్ మొత్తం వ్యాలిడిటీతో జియో టీవీకి ఫ్రీ యాక్సెస్ కూడా పొందవచ్చు.
మీరు అర్హులైతే.. అన్‌లిమిటెడ్ 5G బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. మీరు 5G కవరేజ్‌లో ఉన్నంత వరకు మీ డేటా వాడొద్దు. మీరు అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉచితంగా పొందవచ్చు. మీరు అన్‌లిమిటెడ్ 5G ఆఫర్‌కు అర్హులో కాదో మీరు మైజియో (MyJio) యాప్‌లో చెక్ చేయొచ్చు.