iPhones Price Drop : వావ్.. అదిరే డీల్స్.. ఈ 3 ఐఫోన్ మోడళ్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి..!
iPhones Price Drop : ఆపిల్ మూడు లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ఐఫోన్లు ఇప్పుడు అసలు ధరల కన్నా అతి తక్కువకే కొనుగోలు చేయొచ్చు. ఓసారి లుక్కేయండి.

iPhones Price Drop
iPhones Price Drop : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం ఐఫోన్ మోడల్ ధరలు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. మీరు లేటెస్ట్ ఐఫోన్ మోడళ్లను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మీకు సరైన సమయం. వచ్చే నెలలో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ దిగ్గజాలు సేల్స్ ప్రారంభం కానున్నాయి.
Read Also : Jio Free Gold : జియో యూజర్లకు పండగే.. అక్షయ తృతీయకు ముందే జియో ‘ఫ్రీ గోల్డ్’ ఆఫర్.. ఇప్పుడే ఇలా కొనేసుకోండి!
ఈ సేల్ సమయంలో తక్కువ ధరకే ఐఫోన్‌ను పొందవచ్చు. అయితే, అధికారిక సేల్ ప్రారంభానికి ముందే మూడు సరికొత్త ఐఫోన్ మోడళ్లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలపై భారీ ధర తగ్గింపులు పొందవచ్చు. ఈ 3 ఐఫోన్ మోడళ్లకు సంబంధించి కొత్త ధరలను ఓసారి వివరంగా పరిశీలిద్దాం.
ఐఫోన్ 15 :
ఈ ఆపిల్ ఐఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందవచ్చు. అమెజాన్‌లో కేవలం రూ.61,390 మాత్రమే. ఈ ఐఫోన్ 15 ప్రారంభంలో రూ.79,990కి లాంచ్ కాగా ఇప్పుడు ధర రూ.18,510 తగ్గింది. అలాగే, రూ.1,841 క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌తో వస్తుంది. 6.1-అంగుళాల డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన 48MP కెమెరాను కలిగి ఉంది.
ఐఫోన్ 16 :
గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ 16 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో ధర రూ.68,780కి అందుబాటులో ఉంది. అసలు ధర రూ.79,900 ఉండగా ఎంపిక చేసిన కార్డ్ కొనుగోళ్లపై మీరు రూ.6,120 తగ్గింపుతో పాటు అదనంగా రూ.4వేలు తగ్గింపును పొందవచ్చు. ఈ మోడల్ లేటెస్ట్ A18 బయోనిక్ చిప్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.
ఐఫోన్ 16 ప్రో :
గత ఏడాదిలో ఐఫోన్ 16 ప్రో వేరియంట్ ధర ప్రారంభంలో రూ.1,19,900గా ఉండేది, కానీ, ఇప్పుడు దాదాపు రూ.14వేలు భారీ ధర తగ్గింపు కలిగి ఉంది. కేవలం రూ.1,05,355కే అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ ధర రూ.1,12,900గా లిస్ట్ అయినా మీరు రూ.7వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ప్రీమియం మోడల్ A18 ప్రో బయోనిక్ చిప్‌తో వస్తుంది. ఆకట్టుకునే ఏఐ ఫీచర్లతో వస్తుంది. ఈ అదిరే డీల్స్‌తో మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.