Jio Free Gold : జియో యూజర్లకు పండగే.. అక్షయ తృతీయకు ముందే జియో ‘ఫ్రీ గోల్డ్’ ఆఫర్.. ఇప్పుడే ఇలా కొనేసుకోండి!
Jio Free Gold : జియో యూజర్ల కోసం ఫ్రీ గోల్డ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఈ ప్రమోషన్ ఆఫర్ అందుబాటులో ఉంది. కస్టమర్లు ఇలా ఈజీగా డిజిటల్ గోల్డ్ ఉచితంగా కొనుగోలు చేయొచ్చు.

Jio Free Gold
Jio Free Gold : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో రీఛార్జ్ ప్లాన్‌లతో ఫ్రీ కాలింగ్ అందించడమే కాదు.. టెలికాం మార్కెట్‌లో టాప్ ట్రెండ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు, జియో తమ యూజర్లకు డిజిటల్ గోల్డ్ కూడా ఆఫర్ చేస్తోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అక్షయ తృతీయకు సరిగ్గా ముందుగానే ‘Jio Gold 24K Days’ అనే ప్రమోజన్ ప్రారంభించింది.
ఏప్రిల్ 29 నుంచి మే 5, 2025 వరకు జరిగే ఈ ప్రమోషనల్ కాలంలో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే కస్టమర్లు ప్రోత్సాహకంగా కాంప్లిమెంటరీ గోల్డ్ అందుకుంటారు. ఈ ఆఫర్ జియోఫైనాన్స్, మైజియో యాప్‌ల ద్వారా అందుబాటులో ఉంది.
రూ.1,000 నుంచి రూ.9,999 మధ్య విలువైన డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే వారు (JIOGOLD1) ప్రోమో కోడ్‌ని ఉపయోగించి అదనంగా 1 శాతం బంగారాన్ని పొందవచ్చు. రూ.10వేల కన్నా ఎక్కువ కొనుగోళ్లకు, చెక్అవుట్ వద్ద (JIOGOLDAT100) కోడ్‌ని అప్లయ్ చేయడం ద్వారా కస్టమర్‌లు 2 శాతం బోనస్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.
ప్రతి వినియోగదారుడు 10 అర్హత గల లావాదేవీలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. గరిష్టంగా రూ. 21వేల విలువైన ఉచిత బంగారం బోనస్ పరిమితి ఉంటుంది. బోనస్ బంగారం లావాదేవీ జరిగిన 72 గంటల్లోపు వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది. ఈ ప్రమోషన్ ఒకేసారి బంగారం కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు (SIP) కాదని గమనించడం ముఖ్యం.
My Jio యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయాలంటే? :
- మీ మొబైల్ ఫోన్‌లో (My Jio) యాప్‌ను ఓపెన్ చేయండి.
- ‘Finance’ సెక్షన్ నావిగేట్ చేయండి.
- డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టే ముందు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- ఈ ప్రక్రియ ద్వారా మీరు బంగారంలో డిజిటల్‌గా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.
“డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు క్యాష్, గోల్డ్ కాయిన్స్ లేదా బంగారు ఆభరణాల రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చు. జియో గోల్డ్ పూర్తిగా డిజిటల్ సురక్షితమైనది. రూ. 10 నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడులతో వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెట్టవచ్చు” అని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.