Rs 500 Notes : రూ. 500 నోట్లతో జాగ్రత్త.. మీ స్మార్ట్‌ఫోన్‌‌తో ఇలా చేస్తే.. ఆ నోటు రియల్ లేదా ఫేక్ ఇట్టే పసిగట్టేయొచ్చు..!

Rs 500 Notes : రూ. 50 కరెన్సీ నోట్లు ఫేక్ లేదా రియల్ అని ఎలా గుర్తుపట్టాలో తెలుసా? మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. ఈజీగా ఆ నోట్ రియల్ లేదా ఫేక్ నోట్ అనేది ఈజీగా కనిపెట్టేయొచ్చు.

Rs 500 Notes : రూ. 500 నోట్లతో జాగ్రత్త.. మీ స్మార్ట్‌ఫోన్‌‌తో ఇలా చేస్తే.. ఆ నోటు రియల్ లేదా ఫేక్ ఇట్టే పసిగట్టేయొచ్చు..!

Rs 500 Notes

Updated On : April 29, 2025 / 1:13 PM IST

Rs 500 Notes : మీ దగ్గర రూ. 500 నోట్ ఉందా? అది రియల్ లేదా ఫేక్ ఎలా గుర్తించాలో తెలుసా? ఇటీవల మార్కెట్లోకి నకిలీ రూ. 500 నోట్లు చలామణీ అవుతున్నాయి. ఈ ఫేక్ నోట్లను గుర్తించడం చాలా కష్టమే. వాస్తవానికి, అసలైన నోట్ లేదా నకిలీ నోట్ మధ్య తేడాలను కూడా గుర్తించలేం. ఇటీవలే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.500 నకిలీ నోట్లకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.

Read Also : CMF Phone 2 Pro : రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో CMF ఫోన్ 2ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

ప్రభుత్వం సీబీఐ, సెబీ, ఎన్‌ఐఏ వంటి సంస్థలకు జారీ చేసిన ఈ హెచ్చరికలో మార్కెట్‌లో రూ.500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నాయని, వాటిని పట్టుకోవడం చాలా కష్టమని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో, మీకు సాయం చేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి రియల్ లేదా ఫేక్ నోట్లను గుర్తించవచ్చు. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

RBI ‘MANI’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి :
మీ ఫోన్‌ని ఉపయోగించి రియల్, ఫేక్ నోట్ల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చు. మీరు ఆర్బీఐ (MANI) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ప్రత్యేకంగా నోట్లను గుర్తించడానికి రూపొందించారు. ఈ యాప్ పూర్తి పేరు మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ (Mobile Aided Note Identifier). మీరు ఈ యాప్‌ను (Google Play Store) లేదా (Apple App Store) నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌ను వాడటం కూడా చాలా సులభం. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ ఫోన్ కెమెరాను ఆన్ చేసి కరెన్సీ నోట్ ముందు పెట్టాలి. ఆ తర్వాత, ఈ యాప్ ఆ నోట్ రియల్ కాదో ఆటోమాటిక్‌గా తెలియజేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ యాప్‌కు ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే.. నోట్ చిరిగిపోయినా లేదా మురికిగా ఉన్నా కూడా అది నోట్‌ను సరిగ్గా స్కాన్ చేయగలదు.

కెమెరాతో నోటు సెక్యూరిటీ ఫీచర్లు :
భారతీయ కరెన్సీలో అనేక రకాల సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. మీ ఫోన్ కెమెరాను ఉపయోగించి ఈ ఫీచర్లన్నింటిని గుర్తించవచ్చు. ఉదాహరణకు.. 500 రూపాయల నోటుపై రాసిన ‘500’ అనే సెక్యూరిటీ థ్రెడ్ ఫోన్ కెమెరా ద్వారా నోటును లైటింగ్‌లో చూసినప్పుడు కలర్ మారుతుంది. మీరు నోటును తిప్పాలి.

అదేవిధంగా, ఫోన్ కెమెరాలో వాటర్‌మార్క్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు మీ ఫోన్ కెమెరా ద్వారా ఈ ఫీచర్లను స్పష్టంగా చూస్తే ఆ నోటు అసలైనది. మరోవైపు, ఈ ఫీచర్లు కనిపించకపోతే ఆ నోటు ఫేక్ అని గుర్తించాలి.

ఫోన్ ఫ్లాష్‌తో అల్ట్రా వైలెట్ టెస్ట్ :
మీరు కొన్ని స్మార్ట్‌ఫోన్‌ల టార్చ్‌ని ఉపయోగించి నోట్ UV టెస్ట్ కూడా చేయవచ్చు. అల్ట్రా వైలెట్ కాంతిలో మాత్రమే కనిపించే భారతీయ నోట్లపై ఇలాంటి సిరా ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. నోట్‌లోని సంఖ్యలు, సెక్యూరిటీ థ్రెడ్ యూవీ కాంతిలో బ్లూ లేదా గ్రీన్‌‌గా మెరుస్తాయి. మీ ఫోన్ ఫ్లాష్ లైట్‌పై పర్పల్ లేదా బ్లూ ప్లాస్టిక్‌ను యూవీ లైట్‌గా ఉపయోగించవచ్చు.

ఆ తర్వాత ఆ బ్లూ కలర్ కాంతిని నోట్‌పై ఉంచి నోట్‌లోని సంఖ్యలు లేదా ఏదైనా ప్రత్యేక ఐకాన్ మెరుస్తున్నాయో లేదో చూడవచ్చు. యూవీ కాంతికి ఫోన్ ఫ్లాష్ లైట్‌లో ప్లాస్టిక్‌ను UV లైట్‌గా ఉపయోగించడం మధ్య తేడా ఉందని తెలుసుకోవాలి. మీరు మార్కెట్లో చౌకైన UV లైట్‌ ద్వారా కూడా నోట్ ఒరిజినల్ అవునో కాదో తెలుసుకోవచ్చు.

Read Also : ATM Transaction Fees : ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? మే 1 నుంచి ఈ బ్యాంకుల ఏటీఎంలో కొత్త ఛార్జీలు.. లిమిట్ దాటితే బాదుడే..!

కెమెరా జూమ్‌తో మైక్రో-లెటరింగ్‌ను చెక్ చేయండి :
భారతీయ కరెన్సీపై చాలా చిన్న పదాలు ప్రింట్ అవుతాయి. వీటిని మైక్రో-లెటరింగ్ అంటారు. సాధారణంగా చూడలేరు. అయితే, మీ ఫోన్ కెమెరా జూమ్ ఫీచర్ ద్వారా స్పష్టంగా చూడొచ్చు. మీ మొబైల్ కెమెరాను జూమ్ మోడ్‌లోకి పెట్టి మహాత్మా గాంధీ అద్దాల దగ్గర లేదా సంఖ్యల కింద కరెన్సీ ప్రత్యేక భాగాలను జాగ్రత్తగా చూడవచ్చు.

ఉదాహరణకు.. కొత్త 500 రూపాయల నోటులో ‘భారత్’, ‘RBI’ ‘500’ వంటి పదాలు చాలా చిన్న పరిమాణంలో ప్రింట్ అవుతాయి. ఫేక్ నోట్లలో అంత చిన్న అక్షరాలను తయారు చేయలేరు. మీరు జూమ్ చేసినప్పుడు ఈ పదాలను స్పష్టంగా చూడవచ్చు. ఆ నోటు రియల్ లేదా ఫేక్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.