Google Pixel 9a Sale : కొత్త పిక్సెల్ ఫోన్ కావాలా? ఈ నెల 16 నుంచే పిక్సెల్ 9a ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన ఫోన్ కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ!

Google Pixel 9a Sale : పిక్సెల్ 9a ఫోన్ మొదటి సేల్ సందర్భంగా పిక్సెల్ ఫోన్ అభిమానులకు తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. సేల్ సమయంలో పిక్సెల్ 9a ఫోన్ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Google Pixel 9a Sale : కొత్త పిక్సెల్ ఫోన్ కావాలా? ఈ నెల 16 నుంచే పిక్సెల్ 9a ఫస్ట్ సేల్.. ఫీచర్ల కోసమైన ఫోన్ కొనేసుకోవచ్చు.. గెట్ రెడీ!

Google Pixel 9a Sale

Updated On : April 15, 2025 / 1:15 PM IST

Google Pixel 9a Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 9a ఫస్ట్ సేల్ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభం కానుంది. కంపెనీ ఈ ఫోన్‌ను మార్చి 2025లో అధికారికంగా లాంచ్ చేసింది.

Read Also : IRCTC Tour Packages : సమ్మర్‌లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC స్పెషల్ ట్రైన్ల ప్యాకేజీలు ఇవే.. 10 రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు..!

అయితే, భారత మార్కెట్లోకి కొంచెం ఆలస్యంగా రిలీజ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్ అధికారిక సేల్ తేదీని ప్రకటించింది. అంతేకాదు.. మీరు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ నుంచే పిక్సెల్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. పిక్సెల్ 9a ఫీచర్లు, ధర, ఇతర వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 9a సేల్ తేదీ :
గూగుల్ పిక్సెల్ 9a ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో పిక్సెల్ 9a ఫోన్ ధర రూ. 49999గా ఉంది. అదే సమయంలో, ఈ కొత్త పిక్సెల్ 9a సేల్ ఏప్రిల్ 16, 2025న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

మీరు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ పిక్సెల్ 9a ఫోన్ మొత్తం పింగాణీ (వైట్), ఐరిస్ (బ్లూ), అబ్సిడియన్ (బ్లాక్) అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

గూగుల్ పిక్సెల్ 9a ఫీచర్లు :
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త ఫోన్ గూగుల్ జెమినితో వస్తుంది. అదే సమయంలో, ఈ ఫోన్ డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఈ ఫోన్‌లో కంపెనీ 6.3-అంగుళాల పోల్డ్ యాక్టువా డిస్‌ప్లేను అందించింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంతేకాదు.. 2700 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది.

Read Also : Vivo V40 Pro : భలే డిస్కౌంట్ బాస్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40 ప్రోపై భారీ తగ్గింపు.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్ సపోర్టుతో వస్తుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 48 + 13MP వచ్చే డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పవర్ కోసం ఈ గూగుల్ పిక్సెల్ 9a పవర్‌ఫుల్ 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. 23W ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది.