Vivo V40 Pro : భలే డిస్కౌంట్ బాస్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40 ప్రోపై భారీ తగ్గింపు.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!
Vivo V40 Pro : కొత్త వివో ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40 ప్రో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo V40 Pro
Vivo V40 Pro : వివో ప్రియులకు గుడ్ న్యూస్.. మీరు వివో అభిమాని అయితే ఇది మీకోసమే. వివో V40 ప్రో ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో V40 ప్రో ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లో గ్రేట్ డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరాను కలిగి ఉంది. అంతేకాదు.. భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ, వివో V40 ప్రో తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
వివో V40 ప్రో 5G కొత్త ధర, డిస్కౌంట్ ఆఫర్ :
ధర విషయానికి వస్తే.. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 54,999కు అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 9శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు డిస్కౌంట్ తర్వాత రూ. 49,999కి కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మీరు మరిన్ని ఆఫర్‌లను పొందవచ్చు.
ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ కింద మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. అనేక మల్టీ బ్యాంక్ కార్డ్‌లపై మీకు రూ.1500 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అదే సమయంలో, మీరు రూ. 45,350 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. కండిషన్స్ వర్తిస్తాయి. అప్పుడు మీరు పూర్తి ధరకు పొందవచ్చు. మీరు రూ. 16,667 నో-కాస్ట్ EMI ఆప్షన్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు.
వివో V40 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమన్షిటీ 9200+ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
అది మాత్రమే కాదు.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రన్ అవుతుంది. కెమెరా, వీడియో క్వాలిటీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, ప్రైమరీ కెమెరా 50MP సెల్ఫీలు క్లిక్ చేసేందుకు వీలుగా ఫ్రంట్ సైడ్ 50MP కెమెరాను అందిస్తోంది. ఈ వివో ఫోన్‌లో పవర్ కోసం 5500mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీని అందిస్తోంది. 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.