Government issues high-security warning for Windows, asks users to update device immediately
Windows Update Warning : మీరు విండోస్ ఆధారిత డెస్క్‌టాప్ వాడుతున్నారా? అయితే విండోస్ యూజర్లు వెంటనే తమ విండోస్ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోండి. ప్రముఖ విండోస్ కంపెనీకి భారత ప్రభుత్వం హైసెక్యూరిటీ వార్నింగ్‌తో అలర్ట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Meity) ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), Windows యూజర్లకు మాల్‌వేర్ రిస్క్ ఉండవచ్చని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. విండోస్ యూజర్లు తమ డివైజ్‌లను వెంటనే అప్‌డేట్ చేయాల్సిందిగా కోరుతోంది. Microsoft Windows కొన్ని వెర్షన్‌లలో వైరస్‌లు, మాల్వేర్, ఇతర హెచ్చరికల నుంచి Windowsను ప్రొటెక్ట్ ప్రోగ్రామ్ Windows Defenderలో భద్రతా లోపం ఉందంటూ సంస్థకు అలర్ట్ చేసింది.
Windows యూజర్లకు హైసెక్యూరిటీ వార్నింగ్ ఏంటి?
విండోస్ హైసెక్యూరిటీ వార్నింగ్ గురించి CERT-In, Microsoft నుంచి నిపుణులు మాట్లాడుతూ.. ఉన్నత-స్థాయి భద్రతా అత్యవసర పరిస్థితుల్లో ఇదొకటిగా పేర్కొన్నారు. భద్రతా లోపాల కారణంగా హ్యాకర్లు కంప్యూటర్‌ను సులభంగా యాక్సెస్ చేయగలరని హెచ్చరించారు. Windows డిఫెండర్ క్రెడెన్షియల్ గార్డ్ కాంపోనెంట్‌లో బగ్ ఉందని గుర్తించారు. దీని ఫలితంగా హ్యాకర్లు సిస్టమ్‌కు ఎలివేటెడ్ యాక్సెస్‌ను పొందేందుకు వీలు కల్పిస్తుంది. డిఫాల్ట్‌ను ట్రిగ్గర్ చేసే బగ్ జీరో-డే వల్నరబిలిటీ కేటగిరీలో ఉంది. అయితే ఇది ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తించడం వీలువుతుందని సూచిస్తుంది. స్పూఫ్, అధీకృత వినియోగదారుగా కనిపించే అవకాశం ఉంది. మొత్తం డొమైన్‌కు యాక్సస్ అందిస్తుంది. సిస్టమ్‌కు లింక్ చేసిన ప్రతి మెషీన్ లేదా అకౌంట్ కంట్రోల్ చేసే డొమైన్‌ల కంపెనీలు, వాటి సంస్థలకు తీవ్రమైన ముప్పుగా పరిగణించవచ్చు.
Government issues high-security warning for Windows, asks users to update device immediately
ప్రపంచవ్యాప్తంగా కొంతమంది భద్రతా నిపుణుల విశ్లేషణ ప్రకారం.. 2021 ఏడాదిలో ఈ భద్రతా లోపాన్ని గుర్తించినట్టు తెలిపారు. ప్రస్తుతం, దాదాపు 1.5 బిలియన్ల మంది యాక్టివ్ Windows యూజర్లు ఉన్నారు. ఇటీవల కనుగొన్న భద్రతా లోపం దాదాపు 43 విభిన్న Microsoft వెర్షన్లను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. Windows డిఫెండర్ క్రెడెన్షియల్ గార్డ్‌లో ప్రివిలేజ్ ఎస్కలేషన్, సెక్యూరిటీ బైపాస్ భద్రతా లోపం ఉందని CERT-హెచ్చరిక పేర్కొంది. ఇప్పటివరకూ ఈ భద్రతా లోపం కారణంగా ప్రభావితమైన విండోస్ వెర్షన్‌లను CERT-ఇన్ కొన్ని విండోస్ వెర్షన్లను రిలీజ్ చేసింది. అందులో మీరు వినియోగించే విండోస్ వెర్షన్ ఉందో ఓసారి చెక్ చేసుకోండి.
Windows వెర్షన్ జాబితా ఇదే :
ARM64-ఆధారిత సిస్టమ్స్ కోసం Windows 11
x64-ఆధారిత సిస్టమ్స్ కోసం Windows 11
x64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 1607
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 1607
x64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10
x64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 21H2
ARM64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 21H2
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 21H2
ARM64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 20H2
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 20H2
x64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 20H2
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 21H1
ARM64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 21H1
x64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 21H1
ARM64-ఆధారిత సిస్టమ్‌ల కోసం Windows 10 వెర్షన్ 1809
x64-ఆధారిత సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 1809
32-బిట్ సిస్టమ్స్ కోసం Windows 10 వెర్షన్ 1809
విండోస్ సర్వర్ 2022 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2022
విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2019
విండోస్ సర్వర్ 2016 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్ 2016
Windows సర్వర్, వెర్షన్ 20H2 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ బులెటిన్‌లో పేర్కొన్న విండోస్ డిఫెండర్ కోసం తగిన ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేయమని CERT-ఇన్ అడ్వైజరీ యూజర్లను కోరింది. అప్‌డేట్ చేసే యూజర్లు తమ సెట్టింగ్‌ల ట్యాబ్‌కు వెళ్లి లేటెస్ట్ అప్ డేట్స్ ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఆటో-అప్‌డేట్ ఆప్షన్ స్టార్ట్ చేసి ఉంటే.. మీ డివైజ్ ఆటోమాటిక్‌గా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కి అప్‌డేట్ అవుతుంది.
Read Also : Windows WhatsApp Users : విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?