Windows WhatsApp Users : విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

Windows WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ విండోస్ యూజర్ల (Windows Users) కోసం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది.

Windows WhatsApp Users : విండోస్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త వెర్షన్.. డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

WhatsApp now has standalone app for Windows users, here is how to download

Windows WhatsApp Users : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ విండోస్ యూజర్ల (Windows Users) కోసం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. విండోస్ యూజర్లు తమ మెసేజ్‌లను పంపడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఇకపై మీ ఫోన్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందిల్లా మీ ల్యాప్‌టాప్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ యాప్ బీటా వెర్షన్ ఇతర యాప్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉందని వాట్సాప్ వెల్లడించింది.

WhatsApp డెస్క్‌టాప్ యూజర్లు వెబ్ ఆధారిత డెస్క్‌టాప్ యాప్ (WhatsApp డెస్క్‌టాప్) లేదా బ్రౌజర్ ఆధారిత యాప్ (WhatsApp Web) ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ యూజర్ల కోసం WhatsApp అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు Windows, Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సంబంధించిన యాప్‌లను డెవలప్ చేస్తున్నామని WhatsApp వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇండిపెండెంట్ యాప్‌ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యాప్ ఆపరేటింగ్ స్పీడ్ బాగుంటుంది. మీ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకించి రూపొందించారు. ఆప్టిమైజ్ విండోస్ యాప్‌ ద్వారా యూజర్లు తమ ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్‌లు, మెసేజ్‌లను స్వీకరించవచ్చు.

WhatsApp now has standalone app for Windows users, here is how to download

WhatsApp now has standalone app for Windows users, here is how to download

Windowsలో WhatsApp ఎలా సెటప్ చేయాలంటే..

– Microsoft Windows యాప్‌ ఓపెన్ చేయండి.
– WhatsAppని డౌన్‌లోడ్ చేయండి
– డౌన్‌లోడ్ చేసిన యాప్ మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేయండి.
– మీ ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి.
– మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
– Androidలో మరిన్ని ఆప్షన్లు లేదా iPhoneలో సెట్టింగ్‌‌పై Tap చేయండి.
– ఆపై Linked In Devices ఆప్షన్‌పై Tap చేయండి.
– WhatsApp డెస్క్‌టాప్ యాప్‌లో కనిపించే QR కోడ్‌కి మీ కెమెరాతో యాక్సస్ చేయండి.

WhatsApp డివైజ్ ఫీచర్ బీటాలో అందుబాటులో లేదు. వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీ ఫోన్ అవసరం లేకుండా ఒకే అకౌంట్లో నాలుగు డివైజ్‌లను లింక్ చేసుకోవచ్చు. WhatsApp త్వరలో ఈ ఫీచర్‌ని టాబ్లెట్‌లోనూ తీసుకురావాలని చూస్తోంది. ప్రస్తుత సెటప్ యూజర్లు ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించలేరు. కంప్యూటర్‌ల నుంచి లాగిన్ చేయడానికి మాత్రమే వీలుంది. అయితే త్వరలో వాట్సాప్ యూజర్లు టాబ్లెట్‌లలో కూడా వాట్సాప్ సులభంగా లాగిన్ కావొచ్చు.

Read Also : WhatsApp Profile Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మీ ప్రొఫైల్ ఫొటోలకు అవతార్ సెట్ చేసుకోవచ్చు!