పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో 2 నెలల్లోనే కేంద్ర ఖజానాకు రూ.40వేల కోట్ల ఆదాయం

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకంతో కేంద్ర ఖజానా గలగలలాడుతోంది. పెట్రోల్, డీజిల్‌‌ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం భారీగా ఆదాయం తెచ్చి పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి రెండు మాసాల్లో వీటిపై ఎక్సైజ్ సుంకంతో ఏకంగా రూ.40 వేల కోట్లు వసూలు చేసింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నిర్ధేశించుకున్న ఎక్సైజ్ సుంకం లక్ష్యంలో తొలి రెండు మాసాల్లోనే(ఏప్రిల్, మే) ఏకంగా 16 శాతం వసూలు చేయడం విశేషం. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఎక్సైజ్ సుంకాల ద్వారా కేంద్ర ఖజానాకు ఏప్రిల్ నెలలో రూ.10,560 కోట్ల ఆదాయం వచ్చింది. మే నెలలో రాబడి మూడింతలు పెరిగింది. మే నెలలో ఏకంగా రూ.29,396 కోట్ల రాబడి వచ్చింది. దీంతో ఏప్రిల్, మే నెలల్లో ని ద్వారా కేంద్ర ఖజానాకు రూ.40 వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది. మే 5న పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రం భారీగా పెంచడంతో పాటు లాక్‌డౌన్ సడలింపుల కారణంగా ఇంధన అమ్మకాలు జోరందుకోవడం దీనికి కారణమవుతున్నాయి.

లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ సుంకం పెంపు:
మే 5న లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతకు ముందు వరకు లీటర్ పెట్రోల్‌ అమ్మకంపై ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.22.98ల ఆదాయం వస్తుండగా మే 5న సుంకం పెంపు ద్వారా ఇది రూ.32.98కి పెరిగింది. అలాగే లీటర్ డీజిల్‌ అమ్మకంపై ఎక్సైజ్ సుంకం ద్వారా గతంలో రూ.18.83 ఆదాయం వస్తుండగా మే 5 తర్వాత రూ.31.83కి పెరిగింది.

లాక్ డౌన్ సడలింపులతో పెరిగిన ఇంధన వినియోగం:
లాక్ డౌన్ లో సడలింపుల తర్వాత 2020 మే లో డీజిల్ వినియోగం 169 శాతం పెరిగింది. ఏప్రిల్ లో 32.50 లక్షల మెట్రిక్ టన్నుల డీజిల్ వినియోగం అవగా, మే నెలలో 54.95 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం జరిగింది. పెట్రోల్ విషయంలోనూ అదే జరిగింది. మే నెలలో పెట్రోల్ వినియోగం 182శాతం పెరిగింది. ఏప్రిల్ లో పెట్రోల్ వినియోగం 9.7లక్షల మెట్రిక్ టన్నులు కాగా, మే నెలలో 17.69 లక్షల మెట్రిక్ టన్నుల ప్రెటోల్ వినియోగం జరిగింది.

పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియం:
మరోవైపు వరుసగా 19వ రోజూ(జూన్ 25,2020) కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం(జూన్ 25,2020) డీజిల్‌పై 14 పైసలు, పెట్రోల్ పై 16 పైసలు పెంచాయి చమురు సంస్థలు. కాగా, ఢిల్లీలో డీజిల్ ధర పెట్రోల్ ధర కన్నా ప్రియంగా మారింది. ఢిల్లీలో డీజిల్ ధరలు పెట్రోల్ ధరలను దాటేశాయి. గురువారం ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర 80 రూపాయలు(రూ.80.02) దాటింది. పెట్రోల్‌ ధర రూ.79.92గా ఉంది.

Read: లీటర్ డీజిల్ ధర రూ.80, ఢిల్లీలో పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియం, కారణం ఇదే..??