Gratuity Tax Exemption : జాబ్ మానేశారా? గుడ్ న్యూస్! గ్రాట్యుటీపై రూ. 20 లక్షల వరకు టాక్స్ ఫ్రీ.. కొత్త రూల్స్ ఏంటి? పూర్తి లెక్కలివే!

Gratuity Tax Exemption : రిటైర్మెంట్ లేదా ఉద్యోగం మానేసినప్పుడు గ్రాట్యుటీ వస్తుంది. కొత్త కార్మిక చట్టం, పెరిగిన పన్ను మినహాయింపు ప్రయోజనాలతో మీ గ్రాట్యుటీ కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. అసలు గ్రాట్యూటీ ఎలా లెక్కించాలి? పన్ను చెల్లించాల్సిన పనిలేదా? పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Gratuity Tax Exemption

  • ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు గ్రాట్యూటీపై బిగ్ రిలీఫ్
  • జాబ్ మానేసినా, రిటైర్ తర్వాత అందే గ్రాట్యూటీపై పన్ను ఉంటుందా?
  • రూ. 20 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు

Gratuity Tax Exemption : మన ఇండియాలో జాబ్ అంటే కేవలం నెల జీతమే కాదు.. భవిష్యత్తు భరోసా కూడా. అందులో గ్రాట్యుటీ కూడా ఒకటి. ఒక ఉద్యోగి ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తే రిటైర్ అవ్వడం లేదా ఉద్యోగాన్ని మానేసినప్పుడు కంపెనీ నుంచి ఒకేసారి లభించే పెద్ద మొత్తమే గ్రాట్యుటీగా పిలుస్తారు.

1972 గ్రాట్యుటీ పేమెంట్స్ చట్టం కింద అమల్లోకి వచ్చింది. కానీ, కాలం మారడంతో పాటు కార్మిక చట్టాల్లో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని పెంచింది.

ముందుగా రూ. 10 లక్షల వరకే ట్యాక్స్ ఫ్రీగా ఉండేది. కానీ, ఇప్పుడు అది రూ. 20 లక్షలకు పెరిగింది. ఎన్నేళ్లు కష్టపడి పనిచేసిన ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో భారీ మొత్తంలో పన్నుల భారం నుంచి రిలీఫ్ పొందవచ్చు. ప్రైవేట్ ఉద్యోగులకైనా, ప్రభుత్వ ఉద్యోగులకైనా అందరికి ఇదే వర్తిస్తుంది. సాదాసీదా ఉద్యోగి నుంచి కుటుంబ బాధ్యతలు మోసే మధ్యతరగతి ఉద్యోగి వరకు అందరికీ ఇది వర్తిస్తుంది అనమాట.

Read Also : Summer AC Tips : మీ AC కూలింగ్ తగ్గిందా? టెక్నీషియన్ వద్దు.. ఈ చిన్న సెట్టింగ్స్ మార్చితే ఏసీ సూపర్ కూలింగ్!

అయితే, త్వరలో అమల్లోకి రానున్న కొత్త కార్మిక చట్టం ప్రకారం నిర్ణీత కాల ఉద్యోగులు కేవలం ఒక ఏడాది సర్వీసు తర్వాత కూడా గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. అయినప్పటికీ, రెగ్యులర్ ఉద్యోగులకు ఐదేళ్ల నిబంధన యథాతథంగా కొనసాగుతుంది. గత 12 నెలల్లో ఏ రోజునైనా 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

రూ. 20 లక్షల వరకు పన్ను లేదు :
గ్రాట్యుటీపై ఆదాయపు పన్ను వర్తిస్తుందా? అంటే.. మీరు అందుకునే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. 2025లో ప్రభుత్వం పన్ను మినహాయింపు పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచింది.

గ్రాట్యుటీ మొత్తంపై నో టాక్స్ :
ప్రైవేట్ ఉద్యోగులు : మీ గ్రాట్యుటీని 3 అంశాల ఆధారంగా లెక్కిస్తారు. వాస్తవంగా అందుకున్న మొత్తం, ప్రభుత్వ రూ. 20 లక్షల పరిమితి లేదా ఫార్ములా ద్వారా లెక్కించిన మొత్తంగా ఉంటుంది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది.

ఉదాహరణకు.. మీరు రూ. 25 లక్షలు అందుకుంటే, రూ. 20 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. మిగిలిన రూ. 5 లక్షలపై మాత్రమే మీ ఆదాయం ఆధారంగా పన్ను విధిస్తారు.

మీ గ్రాట్యుటీని ఎలా లెక్కించాలి? :
లెక్కించే విధానం :
మీ లాస్ట్ బేసిక్ పే, డీఏ (DA)ను కలపండి. దాన్ని 15తో గుణించండి. ఆ తర్వాత మీరు పనిచేసిన సంవత్సరాల సంఖ్యతో గుణించి చివరగా 26తో భాగించండి.

15, 26 అర్థం ఏంటి? :
ఇందులో 26 అనేది ఒక నెలలోని వర్కింగ్ డే సంఖ్యను సూచిస్తుంది. 15 అనేది ప్రతి ఏడాదిలో సర్వీసుకు 15 రోజుల జీతాన్ని సూచిస్తుంది.

పన్ను ఆదా : ఈ ఫార్ములా నుంచి వచ్చే మొత్తం రూ. 20 లక్షల వరకు ఉంటే.. మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీ మొత్తం సేవింగ్స్ పొందవచ్చు.