Nano Banana 2 : వావ్.. అదిరింది గురూ.. గూగుల్ నానో బనానా 2 ట్రై చేశారా? ఫీచర్లు మాత్రం కేక.. ఈ టూల్ ఎలా వాడాలంటే?
Nano Banana 2 : గూగుల్ పాపులర్ ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్ లేటెస్ట్ వెర్షన్ నానో బనానా 2 రిలీజ్ అయింది. ఈ ఏఐ టూల్ ఫీచర్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nano Banana 2
- కొత్త మోడల్ జెమిని రియల్-టైమ్ నాలెడ్జ్ బేస్ ఆధారంగా పనిచేస్తుంది.
- నానో బనానా 2 రియాల్టీ ఫొటోలు, వీడియోలను జనరేట్ చేస్తుంది
- ఫొటోలలోని టెక్స్ట్‌ను కూడా ట్రాన్సులేట్ చేయొచ్చు.
Nano Banana 2: గూగుల్ జెమిని యూజర్లకు భారీ గుడ్ న్యూస్. గూగుల్ నానో బనానా 2 వచ్చేసింది. గూగుల్ పాపులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇమేజ్ జనరేషన్ మోడల్ నానో బనానా 2 లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో ఉంది.
ఈ కొత్త మోడల్ గతంలో వెర్షన్ కన్నా ఒరిజినల్ ఫొటోల మాదిరిగానే జనరేట్ చేయొచ్చు. జెమిని యాప్‌లోని ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్లలో డిఫాల్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. రియల్-టైమ్ డేటా, వెబ్ సెర్చ్‌ల నుంచి సేకరించిన ఫొటోల ఆధారంగా వర్క్ అవుతుంది.
నానో బనానా 2 అనేది జెమిని ఫ్లాష్ సూపర్ ఫాస్ట్ ఇంటెలిజెన్స్‌కు విజువల్ జనరేషన్ అందిస్తుంది. ఎడిటింగ్ చాలా వేగంగా ఉంటుంది. ఇంతకుముందు కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు ప్రో ఫీచర్లను మరింత ఎక్కువ మందికి అందిస్తుంది. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Read Also : Realme 16 5G : కొత్త ఫోన్ కావాలా? రియల్‌మి 16 5G ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. అతి చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!
ఈ నానో మోడల్ అద్భుతమైన లైటింగ్, టెక్స్చర్ల వంటి వివరాలతో మీడియాను జనరేట్ చేస్తుంది. ప్రో మోడల్లో హై క్వాలిటీ ఫీచర్లతో వస్తుంది. ఫొటోలు స్పీడ్ జనరేట్ అవుతాయి. యూజర్లు 512px నుంచి 4K వరకు రిజల్యూషన్లలో మల్టీ యాస్పెక్ట్ రేషియోలలో ఫోటోలను జనరేట్ చేయొచ్చు.
నానో బనానా 2 ఫీచర్లు :
ఈ కొత్త మోడల్ జెమిని రియల్-టైమ్ నాలెడ్జ్ బేస్‌పై ఆధారపడి పనిచేస్తుంది. నిర్దిష్ట విషయాలను కచ్చితంగా అందించేలా వెబ్ సెర్చ్, ఫొటోల నుంచి రియల్ టైమ్ డేటాను మిక్స్ చేయొచ్చు. నానో బనానా 2, మార్కెటింగ్ మాకప్‌లు లేదా గ్రీటింగ్ కార్డ్‌ల కోసం కచ్చితమైన టెక్స్ట్‌ను జనరేట్ చేయొచ్చు. ఫొటోలలోని టెక్స్ట్‌ను ట్రాన్సులేట్ చేయొచ్చు. అవసరానికి తగినట్టుగా ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.
ఈ కొత్త ఏఐ మోడల్ యూజర్ల రిక్వెస్టలకు కచ్చితంగా స్పందిస్తూ, అడిగిన ఫొటోను యథాతథంగా అందిస్తుంది. 512px నుంచి 4K వరకు వినియోగదారులకు యాస్పెక్ట్ రేషియో, రిజల్యూషన్‌పై ఫుల్ కంట్రోల్ ఉంటుంది. క్రియేట్ చేసిన కంటెంట్‌ను అప్పటికప్పుడు వినియోగించవచ్చు. ఈ మోడల్ రెండరింగ్పై కూడా యూజర్లకు ఎక్కువ కంట్రోల్ ఉంటుంది.
నానో బనానా 2 ఎలా వాడాలి? :
నానో బనానా 2 ద్వారా ముందుగా మీ ఫోన్లో జెమిని యాప్‌ను ఓపెన్ చేయాలి. నానో బనానా 2కి వెళ్లండి. ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడళ్లలో నానో బనానా ప్రో కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ మొబైల్, డెస్క్‌టాప్‌లో గూగుల్ యాప్, ఏఐ మోడ్, లెన్స్ ద్వారా 141 కొత్త దేశాలు, ప్రాంతాలలో 8 భాషలలో అందుబాటులో ఉంది. గూగుల్ క్లౌడ్‌లో వర్టెక్స్ ఏఐలో జెమిని ఏపీఐతో ప్రివ్యూ కూడా అందుబాటులో ఉంది.
