Cement Prices
Cement prices: జీఎస్టీలో ఇటీవల తీసుకువచ్చిన సంస్కరణల వల్ల సిమెంట్ రేట్లు తగ్గనున్నాయి. 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ 30-35 వరకు తగ్గి, నిర్మాణ వ్యయం తగ్గుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) రిపోర్టు తెలిపింది.
సెప్టెంబర్ 22 నుంచి సిమెంట్‌పై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. ఈ మార్పు సిమెంట్ రంగానికి అనుకూలంగా ప్రభావం చూపుతుందని ఇండ్-రా తెలిపింది. గృహ నిర్మాణాలకు తోడ్పడుతుందని చెప్పింది. (Cement prices)
ఇండ్-రా వేసిన అంచనాల ప్రకారం.. ఆయా కంపెనీలు సిమెంట్ ధరలను తగ్గిస్తాయి. దీంతో మౌలిక సదుపాయాలు, గృహ ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు తగ్గుతుంది. ఆయా కంపెనీలు సిమెంటును అమ్మిన తర్వాత పొందే నికర ఆదాయం స్థిరంగా ఉంటుంది.
అయితే, ఇండ్-రా సిమెంట్ డిమాండ్ వృద్ధి అంచనాను సంవత్సరానికి 5-7 శాతానికే పరిమితం చేసింది. ఆయా విభాగాల్లో డిమాండ్ వెంటనే పెరగకపోవచ్చని తెలిపింది. వర్షాల కారణంగా నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడుతుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి సింగిల్ డిజిట్‌లోకి పడిపోతుంది.
Also Read: రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. ఈ నెల 25 డెడ్ లైన్.. అర్జంట్‌గా ఈ పని చేయండి.. లేకపోతే..
గత ఆర్థిక సంవత్సరం సిమెంట్ రంగంలో వృద్ధి మందగమనంతో సాగింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సిమెంట్ రంగంలో 6-7 శాతం వృద్ధి నమోదైంది. గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ, వాస్తవ వేతనాల పెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయం దీనికి తోడ్పడ్డాయి.
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభ నెల (జూలై)లో 12 శాతం వాల్యూమ్ వృద్ధి నమోదైంది. అయితే, మాన్సూన్ నిర్మాణ కార్యకలాపాలకు అడ్డుతగలడంతో ఈ రెండో త్రైమాసికంలో నికర రియలైజేషన్లు వరుసగా తగ్గాయి.
ఇకపై గ్రామీణ డిమాండ్ బలంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పట్టణాల్లో డిమాండ్ మాత్రం తగ్గుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు తగ్గిపోవడంతో కొత్త హౌసింగ్ కార్యకలాపాలు మందగించాయి. రెండో త్రైమాసికంలో రేటు కోతలు పట్టణ డిమాండ్‌ను పెంచినా, గ్రామీణ ప్రాంతాల కంటే వృద్ధి బలహీనంగా ఉంటుంది.