Gold Rates Today : షాకింగ్.. ఏంటి బంగారం ధరల్లో ఈ అనూహ్య మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర (Gold Rates Today) పెరిగింది.

Gold Rates Today
Gold Rates Today : బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. గోల్డ్ ధరల (Gold Rates Today) పెరుగుదల ఆర్థిక ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు బంగారం కేవలం ఆభరణాలకే కాదు.. పెట్టుబడిగా కూడా మరింత ప్రాముఖ్యత పెంచుకుంటోంది. ఫలితంగా వీటి ధరలు సామాన్య ప్రజలు అందుకోలేని.. కనీసం తలెత్తి చూడలేని స్థాయికి దూసుకెళ్తున్నాయి.
బంగారం ధర ఇప్పటికే సరికొత్త రికార్డులను నమోదు చేసింది. అయితే, మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం.. బంగారం ధరలు దాదాపు 50శాతం వరకూ పెరిగే చాన్స్ ఉందట. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని స్థాయికి గోల్డ్ రేటు చేరుతుందని అంచనా వేసింది.
గత మూడు వారాలుగా గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఈ మూడు వారాల్లో 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.10వేల వరకు పెరిగింది. అయితే, బుధవారం కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు రికార్డు ధరలను నమోదు చేస్తోంది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ (31.1035 గ్రాములు) మూడు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,640 డాలర్ల వద్ద కొనసాగుతుంది. రాబోయే కాలంలో ఔన్సు గోల్డ్ రేటు 5వేల డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా. అదే జరిగితే.. భారత దేశంలో 10గ్రాముల గోల్డ్ రేటు లక్షన్నరకు చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,01,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,10,509కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,10,660కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,01,300 కాగా.. 24క్యారెట్ల ధర రూ.1,10,509కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,30,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,40,000కు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.