Happy Diwali 2025 : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ 7 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

Happy Diwali 2025 : దీపావళి పటాసులు కాల్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గాయాలు, ప్రమాదం జరగకుండా ఉండేలా సేఫ్టీ టిప్స్ పాటించండి.

Happy Diwali 2025 : దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ 7 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

Firecracker Safety Tips

Updated On : October 20, 2025 / 12:16 PM IST

Happy Diwali 2025 : దీపావళి పండగ.. దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఇల్లు దీపాలతో వెలిగిపోతుంది. అందంగా రంగురంగుల పూలతో అలంకరించుకుంటారు. దీపావళి అనగానే అందరికి గుర్తొచ్చేది టపాసులు.. ఇవి లేకుండా అసలు పండగే ఉండదు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తమ ఫ్యామిలీతో కలిసి టపాసులను కాలుస్తూ పండగ చేసుకుంటారు.

టపాసులు కాల్చడం ఆనందమే అయినా (Happy Diwali 2025) కొన్నిసార్లు అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రాణాల మీదుకు తెస్తుంది. ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో పటాకులు కాల్చడం వల్ల అనేక మందికి కాలిన గాయాలు సంభవిస్తున్నాయి. దీపావళి వేడుకల్లో పటాకులు కాల్చే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. దీపావళి రోజున పటాకులు కాల్చే ముందు మీరు పాటించాల్సిన 7 సేఫ్టీ టిప్స్ మీకోసం అందిస్తున్నాం.

టపాసులు కాల్చే ముందు ఈ 7 ముఖ్యమైన జాగ్రత్తలు పాటించండి :

దీపావళి నాడు పటాకులు కాల్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకు హాని కలుగుతుంది. ఆనందంగా గడపాల్సిన సమయంలో ప్రమాదానికి దారితీయకుండా చూసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అనేది గుర్తుంచుకోవాలి. పటాసులు కాల్చే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీగా ఉంచుకోండి :
టపాసులను కాల్చే సమయంలో తరచుగా చిన్న గాయాలు అవుతుంటాయి. అందుకే ఎల్లప్పుడూ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర ఉంచండి. అందులో యాంటీసెప్టిక్ క్రీమ్, పెయిన్ రిలీవర్స్, క్లెన్సింగ్ లోషన్, బ్యాండేజీలు, కాటన్, హ్యాండ్ గ్లోవ్స్ వంటి ముఖ్యమైన వస్తువులు ఉండాలి. అత్యవసర చికిత్సకు ఇవి తప్పనిసరిగా ఉండాలి.

Read Also : Happy Diwali 2025 : హ్యాపీ దీపావళి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి..!

సింథటిక్ వద్దు.. కాటన్ దుస్తులే ధరించండి : 
పటాకులు కాల్చేటప్పుడు దుస్తుల ఎంపిక అత్యంత ముఖ్యం. నైలాన్ లేదా సింథటిక్ బట్టలు చాలా త్వరగా మంటలు అంటుకుంటాయి. టపాసులను మండించినప్పుడు చర్మానికి వెంటనే అంటుకుపోతాయి. అప్పుడు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎల్లప్పుడూ వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించండి. వదులుగా ఉండే దుపట్టాలు లేదా స్కార్ఫ్‌లు ధరించకూడదని గుర్తుంచుకోండి.

ఇయర్‌ఫోన్స్ తప్పక వాడండి :
దీపావళి రోజున ఎక్కువ మొత్తంలో టపాసులను పేలుస్తుంటారు. చాలా పటాకులు 100 డెసిబెల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని కలిగి ఉంటాయి. అది మీ చెవిపోటుకు దారితీయొచ్చు. పెద్ద శబ్దంతో చెవుల్లో తిమ్మిరికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పటాకులు కాల్చేటప్పుడు ఇయర్‌బడ్స్ ధరించడం మంచిది. మీ కళ్ళను రక్షించుకోవడానికి జీరో-పవర్ లేదా ట్రాన్స్‌పరంట్ గాగుల్స్ కూడా పెట్టుకోవచ్చు.

బహిరంగ ప్రదేశంలో మాత్రమే పటాకులు కాల్చండి :
దీపావళి సమయంలో బహిరంగ, సురక్షితమైన ప్రదేశంలో మాత్రమే టపాసులను కాల్చండి. ఇంటి లోపల లేదా బాల్కనీల వంటి పరిమిత ప్రదేశాలలో టపాసులను పేల్చడం అత్యంత ప్రమాదకరం. పరిమిత స్థలంలో పటాకులు కాల్చడం వల్ల ఊపిరాడదు. కొన్నిసార్లు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

చేతుల్లో పట్టుకుని టపాసులు కాల్చడం ప్రమాదకరం :

మీ చేతుల్లో పట్టుకుని పటాకులు కాల్చేందుకు ప్రయత్నించొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే కొన్నిసార్లు ఊహించని విధంగా చేతిలోనే పేలిపోతాయి. ముఖం, చేతులకు తీవ్రమైన కాలిన గాయాలు అవుతాయి. ఈ ప్రమాదకరమైన పద్ధతిని కచ్చితంగా నివారించండి. ఎల్లప్పుడూ సురక్షితంగా నేలపై పెట్టిన తర్వాత మాత్రమే టపాసులను కాల్చండి.

పాత లేదా దెబ్బతిన్న టపాసులను కాల్చొద్దు :
పాత లేదా దెబ్బతిన్న బాణసంచాను పేల్చొద్దు. కొన్నిసార్లు చేతిలోనే పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి బాణసంచాను పూర్తిగా నివారించండి. మంచి క్వాలిటీ గల టపాసులను మాత్రమే వాడండి.

ఒక బకెట్ నీరు దగ్గర ఉంచుకోండి :
టపాసులు కాల్చేటప్పుడు ఎప్పడూ ఒక బకెట్ నీరు, మందపాటి దుప్పటిని దగ్గర ఉంచుకోండి. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం లేదా గాయమైతే ప్రాథమిక చికిత్స కోసం అవసరం పడతాయి.